
ముంబై: 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, తెలంగాణ ప్రభుత్వాలు ఉచితంగా తమ రాష్ట్రాల్లో 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మే 1వ తేదీ నుండి మహారాష్ట్రలో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ అందించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు గాను గ్లోబల్ టెండర్లను పిలుస్తామని మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. కరోనా మూడో వేవ్ కూడ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని మంత్రి ఆదిత్య ఠాకూర్ తెలిపారు.
also read:దేశంలో 551 కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు: పీఎం కేర్స్ నిధుల వినియోగం
దేశంలో మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల్లో కేసుల ఉధృతి తగ్గడం లేదు.మహారాష్ట్ర,ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఉత్తర్‌ప్రదేశ్ లో వీకేండ్ లాక్ డౌన్ విధించారు. దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను మే 1వ తేదీ నుండి కేంద్రం ప్రారంభించనుంది. వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 24 నుండి కోవిన్ యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది.