పెళ్లికి ముందు మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్టులు.. వివాదంలో మధ్యప్రదేశ్ వివాహ పథకం

Published : Apr 24, 2023, 01:16 AM IST
పెళ్లికి ముందు మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్టులు.. వివాదంలో మధ్యప్రదేశ్ వివాహ పథకం

సారాంశం

మధ్యప్రదేశ్‌లో సామూహిక వివాహాలు నిర్వహించే ప్రభుత్వ పథకం వివాదాస్పదమైంది. పెళ్లికి ముందు యువతులకు ప్రెగ్నెన్సీ టెస్టు చేపట్టడం కలకలం రేపింది. దిండోరిలో సామూహిక వివాహ కార్యక్రమానికి ముందు యువతులకు ప్రెగ్నెన్సీ టెస్టు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది.  

భోపాల్: పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆడపిల్లలకు పెళ్లి చేసే పథకం వివాదాస్పదమైంది. ఈ సామూహిక వివాహాలకు ముందు నూతన వధువులకు ప్రెగ్నెన్సీ టెస్టు చేయడం కలకలం రేపింది. శనివారం 219 మహిళలకు ఈ స్కీం కింద పెళ్లి చేయాల్సి ఉండగా.. వారికి ప్రెగ్నెన్సీ టెస్టు చేయగా.. ఐదుగురికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ప్రభుత్వ జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ఈ వివాదాస్పద ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ టెస్టును ఎవరు ఆర్డర్ చేశారని కాంగ్రెస్ ప్రశ్నించింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కన్య వివాహ్/నికాహ్ యోజనా పథకాన్ని 2006 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఈ స్కీం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆడ పిల్లల పెళ్లికి ప్రభుత్వం రూ. 56 వేల ఆర్థిక సహకారం అందిస్తుంది.

దిండోరిలోని గద్సారాయ్ ఏరియాలో ఈ పథకం కింద సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రెగ్నెన్సీ టెస్టు పాజిటివ్ వచ్చిన ఓ మహిళ మాట్లాడుతూ.. ‘పెళ్లికి ముందునుంచే కాబోయే భర్తతో నేను కలిసి ఉంటున్నా. అందుకే నా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చింది. బహుశా ఇందుకోసమే ఫైనల్ లిస్టు నుంచి నా పేరు తొలగించారు. అధికారులూ తన పేరు తొలగించడానికి సరైన కారణం చెప్పలేదు’ అని ఆమె తెలిపింది.

గతంలో ఎప్పుడూ ఇలాంటి టెస్టులు నిర్వహించలేదని బచ్చర్‌గావ్ గ్రామ సర్పంచ్ మెదాని మారావి తెలిపారు. ఇది ఆ యువతులకు అవమానమేనని, ఇప్పుడు కుటుంబం వారు దోషులుగా నిలబడాలా? అని ప్రశ్నించారు.

Also Read: నెల కిందే అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేవాళ్లం.. కానీ..: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు

ఏజ్ వెరిఫికేషన్ కోసం, ఫిజికల్ ఫిట్నెస్, సికిల్ సెల్ అనేమియా కోసం టెస్టులు చేస్తుంటారని దిండోరి సీఎంహెచ్‌వో డాక్టర్ రమేశ్ మారావి తెలిపారు. కొందరు అనుమానిత యువతులకు ప్రెగ్నెన్సీ టెస్టు చేయాలనే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించారని వివరించారు. తాము కేవలం టెస్టులు చేస్తామని, జాబితాలో నుంచి తొలగించే నిర్ణయం ఆరోగ్య శాఖ నివేదికల ఆధారంగా సామాజిక న్యాయ శాఖ తీసుకుంటుందని చెప్పారు.

ఇది మధ్యప్రదేశ్ ఆడబిడ్డలను అవమానపరచడమే అని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..