ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025 కోసం నీటి నిర్వహణకు మొబైల్ యాప్, వెబ్‌సైట్ ఆధారిత 'వాటర్ మానిటరింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్'ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థ నీటి మట్టాలను పర్యవేక్షించడం, నివేదించడం, త్వరిత నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం వచ్చే ఏడాది 2025 జనవరిలో ప్రారంభం కానున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. సీఎం యోగి ఈ కుంభ మేళాను ప్రాచీన పవిత్రతను కాపాడుతూనే ఆధునిక సాంకేతికతను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు, పర్యాటకులకు అత్యాధునిక పద్దతుల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమయ్యారు.
ఈ నేపథ్యంలో మహా కుంభమేళా ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలను కల్పించడంతో పాటు ప్రయాగరాజ్ అంతటా ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారిత కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది యోగి సర్కార్. ఈ క్రమంలోనే యోగి ప్రభుత్వం వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఆధారిత 'వాటర్ మానిటరింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' నీటి నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది.
undefined
ఈ మొబైల్ యాప్ ఆధారిత వాటర్ మానిటరింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఆధునిక సౌకర్యాలతో సన్నద్ధం చేసిన సాగునీటి, జలవనరుల శాఖ కోసం రూపొందిస్తారు. దీని ద్వారా నీటి నిర్వహణకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను పర్యవేక్షించడం, సరఫరా వంటి పనులను పూర్తి చేయవచ్చు. ఈ ఆధునిక యాప్ ఆధారిత వ్యవస్థ అభివృద్ధి, నిర్మాణ బాధ్యతను యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీఎల్‌సీ)కి అప్పగించారు.
మహాకుంభ్ వాటర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక సమగ్ర పరిష్కారం. ఇది వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌ను సమన్వయం చేస్తుంది. ముందుగా నిర్ణయించిన కంట్రోల్ పాయింట్ల వద్ద నీటి మట్టాలను పర్యవేక్షించడానికి, నివేదించడానికి దీన్ని రూపొందించారు. ఈ వ్యవస్థ ఉద్దేశం డేటాను సంక్షిప్త, ముందుగా నిర్వహించిన ఫార్మాట్‌లో సంగ్రహించడం, నీటి మట్టం పెరుగుదల, భారీ వర్షాలు, వరదలు వంటి పరిస్థితుల్లో త్వరిత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పించడం. ఈ వ్యవస్థ మహాకుంభ్ నిర్వహణ, భవిష్యత్ శాఖా అవసరాలకు చాలా ముఖ్యం.
ఈ వ్యవస్థను సమర్థవంతమైన రిపోర్టింగ్, త్వరిత నిర్ణయం తీసుకోవడం, హెచ్చరికలు, నోటిఫికేషన్లు, డేటా విశ్లేషణ, ట్రెండ్ మానిటరింగ్, నీటి మట్టం ట్రెండ్ ప్రిడిక్షన్ మ్యాట్రిక్స్‌తో సన్నద్ధం చేస్తారు. నీటి మట్టాలను పర్యవేక్షించడానికి కంట్రోల్ పాయింట్ల GPS కోఆర్డినేట్‌ల డేటాబేస్‌ను సిద్ధం చేస్తారు. భౌగోళిక స్థితికి అనుగుణంగా కొత్త కంట్రోల్ పాయింట్ల నిర్మాణానికి కూడా ఇది ఆధారం అవుతుంది.