కుంభమేళాలో ప్రతి ఒక్కరికి స్వచ్చమైన గాలి ... యోగి సర్కార్ యాక్షన్ ప్లాన్

Published : Dec 21, 2024, 08:29 PM IST
కుంభమేళాలో ప్రతి ఒక్కరికి స్వచ్చమైన గాలి ... యోగి సర్కార్ యాక్షన్ ప్లాన్

సారాంశం

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మొదటిసారిగా 100 ఏళ్లు పైబడిన చెట్లను, వన్యప్రాణులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. ఇందులో భాగంంగా ఏం చేస్తున్నారంటే... 

మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్ కు వచ్చే భక్తులతో పాటు వన్యప్రాణులు, చెట్ల సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది యోగి సర్కార్. ఇందులో భాగంగానే పురాతన వృక్షాలు, వన్యప్రాణుల కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు 100 ఏళ్లు పైబడిన చెట్లను కాపాడేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ఆపరేషన్ ద్వారా పురాతన వృక్షాలను సంరక్షిస్తారు. వన్యప్రాణులను వాటి ఆవాసాలకు చేర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. భక్తుల సౌకర్యార్థం రోడ్లు, పార్కింగ్, టెంట్ ఏరియాల్లో ఉన్న పాత చెట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తద్వార పర్యావరణ పరిరక్షణతో పాటు కుంభమేళాకు వచ్చే భక్తులకు స్వచ్చమైన గాలి లభిస్తుంది.   

మహాకుంభ్ నగర్‌లో 100 ఏళ్లు పైబడిన చెట్లు చాలా ఉన్నాయి. వీటి సంరక్షణకు యోగి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాగరాజ్‌లో అటవీ శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. చెట్ల చుట్టూ కంచె వేసి బలపరుస్తారు. చెట్ల చుట్టూ పటిష్టమైన చిన్న గోడలు నిర్మిస్తారు.తద్వారా చెట్లు రక్షింపబడతాయి.

భక్తులతో పాటు వన్యప్రాణుల రక్షణ

ప్రయాగరాజ్ లోని కుంభమేళా ప్రాంతంలోని పురాతన వృక్షాల సంరక్షణపై అటవీ శాఖ దృష్టి సారించింది. భక్తుల రాకపోకలకు అనువుగా చెట్ల కొమ్మలను కత్తిరిస్తున్నారు. చెట్ల అందాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. మేళా ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ, రెస్క్యూ పనులు చేపడుతున్నారు. దీనికి రూ.20 లక్షల బడ్జెట్ కేటాయించారు. భక్తులకు, వన్యప్రాణులకు రక్షణ కల్పించడం, వాటిని వాటి ఆవాసాలకు చేర్చడం ఈ ప్రాజెక్టులో భాగం.

శుభ్రమైన నీరు, గాలి 

సీఎం యోగి ఆదేశాల మేరకు ఈసారి మహాకుంభ్‌లో భక్తులకు శుభ్రమైన నీరు, గాలి, ప్లాస్టిక్ రహిత వాతావరణం కల్పిస్తున్నారు. ఈసారి మహాకుంభ్ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ సక్సేనా తెలిపారు. భక్తులు శుభ్రమైన నీరు, గాలిని ఆస్వాదించవచ్చు. ఈ కార్యక్రమానికి సాధుసంతుల సహకారం తీసుకుంటున్నారు. భక్తులు ప్రసాదాలు, పువ్వులు ప్లాస్టిక్ సంచుల్లో తీసుకురావద్దని కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu