మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్ సిద్దమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం కోసం అత్యాధునిక కంట్రోల్ రూమ్ సిద్ధమైంది. మేళా భద్రత, నిర్వహణకి ఇదే కేంద్రం.
ప్రయాగరాజ్ మహా కుంభమేళా : ఈసారి ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళా కనువిందు చేయనుంది. దేశవిదేశాల నుంచి భక్తులు త్వరలోనే ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ క్రమంలో మేళా మొత్తాన్ని నిర్వహించే కంట్రోల్ రూమ్ సిద్ధమైంది. ఇక్కడి నుంచే ఉన్నతాధికారులు కుంభమేళా కోసం వ్యూహరచన చేస్తారు. మేళా మొత్తం మీద ఇక్కడి నుంచే నిఘా ఉంటుంది. ఈ కంట్రోల్ రూమ్‌ని బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ పవన్ పాండే రూపొందించారు.
కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ... సీఎం యోగి ఈ మహాకుంభ్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌ని సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చూపించాలనేది తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. మహా కుంభమేళాను అద్భుతంగా నిర్వహించేందుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖ కళాకారులు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారన్నారు.
undefined
కంట్రోల్ రూమ్‌లో అధికారులకు ప్రత్యేక క్యాబిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత, పరిపాలనతో పాటు, వైద్యం, తాగునీరు వంటి అన్ని ముఖ్యమైన అంశాలనూ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇక్కడి నుంచే వ్యూహరచన చేస్తారు. విభాగాల సమన్వయం కోసం కాన్ఫరెన్స్ హాల్‌లు, మీడియా బ్లాక్‌లు కూడా ఉన్నాయి. ఈ కేంద్రానికి ‘L’ ఆకారం ఇస్తున్నారు. అధికారులకు, సిబ్బందికి అత్యాధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.