
Two terror attack accused granted bail: ఉగ్రవాద కేసులో అరెస్టయిన ఇద్దరికి అలహాబాద్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరూ మహ్మద్ ముస్తాకీమ్, మహ్మద్ షకీల్ లు.. ఉగ్రదాడి కేసులో అరెస్టయ్యారు. దేశానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడటం, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించినందుకు వీరిద్దరిపై కేసు నమోదైంది. అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.
నిందితులకు బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ ఏఆర్ మసూదీ, జస్టిస్ ఓపీ శుక్లాలతో కూడిన ధర్మాసనం విచారణ పూర్తయ్యే వరకు ప్రతి నెల మొదటి వారంలో సంబంధిత పోలీస్ స్టేషన్లలో హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. కేసును గురించి సంబంధిత వర్గాలు వివరాలను వెల్లడిస్తూ.. దేశానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడటం, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించినందుకు వీరిద్దరిపై కేసు నమోదైందని తెలిపారు. వీరికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు లక్నో బెంచ్ వారిద్దరికీ ఎలాంటి నేరచరిత్ర లేదనీ, ఏడాది పాటు జైల్లో ఉన్నారని తెలిపింది.