ప్రశాంత్ కిషోర్ గతేడాదే కాంగ్రెస్ లో చేరాల్సింది.. కానీ అది జరగలేదు ‍‍‍‍‍‍- ప్రియాంక గాంధీ

By team teluguFirst Published Jan 22, 2022, 11:05 AM IST
Highlights

ప్రశాంత్ కిషోర్ గతేడాదే కాంగ్రెస్ లో చేరాల్సిందని, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఆయనకు పలు దశల్లో చర్చలు జరిగాయని, కానీ అవి విఫలయ్యాయని స్పష్టం చేశారు. 

ఎన్నికల వ్యూహక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ (prashanth kishor) గ‌తేడాది కాంగ్రెస్ లో చేరాల్సి ఉంద‌ని.. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అది జ‌ర‌గ‌లేద‌ని ప్రియాంక గాంధీ వాద్రా (priyanka gandhi wadra) అన్నారు. శుక్ర‌వారం ఆమె ఎన్ డీటీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంట‌ర్వూలో మాట్లాడారు. ప్ర‌శాంత్ కిషోర్ కు, కాంగ్రెస్ (congress) పార్టీకి మ‌ధ్య జ‌రిగిన‌ట్టు ఆమె అంగీక‌రించారు. అయితే ఆ చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేద‌ని ఆమె తెలిపారు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయని అన్నారు. ఇందులో కొన్ని ఆయ‌న వైపు, మ‌రి కొన్ని త‌మ వైపు కార‌ణాలు చెప్పారు. తాను దాని పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాల‌నుకోవ‌డం లేద‌ని తెల‌పారు. స్థూలంగా కొన్ని విషయాలపై ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ లోకి బ‌యటి వ్యక్తిని తీసుకురావడంలో ఇష్టా, అయిష్టాలతో సంబంధం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ఇష్టం లేకపోతే పీకే (pk) తో అన్ని చర్చలు జరిగేవి కావని అన్నారు. 

ప్రశాంత్ కిషోర్ గతేడాది సోనియా గాంధీ (sonia gandhi), రాహుల్ గాంధీ (rahul gandhi), ప్రియాక గాంధీ (priyanka gandhi)ల‌తో ప‌లు ద‌శ‌ల్లో చ‌ర్చలు జ‌రిపారు. రాహుల్ గాంధీ నివాసానికి ప్ర‌శాంత్ కిషోర్ వెళ్లే స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫొటోల వ‌ల్ల ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. పీకే కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం ఖాయం అయిపోయింద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే ఈ చ‌ర్చ‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ (congress) స్పందించ‌లేదు. చ‌ర్చ‌లు జ‌రిగిన మాట వాస్త‌వ‌మే అని ప్రియాంక గాంధీ శుక్ర‌వారం స్ప‌ష్టం చేశారు. అయితే చర్చలు విఫలవమడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆ స‌మ‌యంలో ప‌లు నివేదిక‌లు వెలువ‌డ్డాయి. గ‌తంలో ఒక సారి కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడం ‘‘ఏ వ్యక్తి యొక్క దైవిక హక్కు’’ కాదని బహిరంగా చెప్పారు. 2024 జాతీయ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నానని పీకే అన్నారు. అయితే 2017 యూపీ (up) ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు పీకే సహాయం అందించారు. కానీ అది ఘోరంగా విఫలమైంది. అయితే పంజాబ్ (punjab)లో మాత్రం విజయం సాధించారు. 

ఇదిలా ఉండ‌గా.. యూపీలో (up) కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్రియాంక గాంధీ (priyanka gandhi) తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక ద‌గ్గ‌ర నుంచి ప్ర‌చారాల వ‌ర‌కు అన్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. రెండు రోజుల కింద‌టే యూపీ ఎన్నిక‌ల కోసం ఆమె కాంగ్రెస్ మేనిఫెస్టో (congress menifesto) విడుద‌ల చేశారు. అలాగే ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల్లో అభ్యర్థుల జాబితా విడుద‌ల చేశారు. ఈ సారి యూపీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్య‌మిస్తామ‌ని గ‌తంలోనే ఆమె తెలిపారు. ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ (ladki hun, lad sakti hun) నినాదాన్ని ఆమె బ‌లంగా ప్ర‌చారం చేశారు. అందులో భాగంగానే ఇప్ప‌టి వ‌ర‌కు 66 మంది మ‌హిళ‌ల‌ను కాంగ్రెస్ రంగంలోకి దించారు. ఈ సారి యూపీలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. 

click me!