ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం.. 12 వాహనాలకు నిప్పు...

By SumaBala BukkaFirst Published Jan 22, 2022, 10:38 AM IST
Highlights

Chhattisgarh లో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, ఒక బుల్ డోజర్ ను తగలబెట్టారు. దీంతో ఆ చుట్టుపక్కల అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Chhattisgarh లో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, ఒక బుల్ డోజర్ ను తగలబెట్టారు. దీంతో ఆ చుట్టుపక్కల అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. 

ఇదిలా ఉండగా, జనవరి 18న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెలగుట్ట వద్ద మంగళవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని  చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తొలుత జవాన్‌ను గాయపడిన చోటుకు వైద్యున్నితరలించి చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌‌లో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌కు తరలించారు. ప్రస్తుతం అంబులెన్స్‌లో అవసరమైన చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇందుకోసం ఆర్ట్స్ కాలేజ్‌ గ్రౌండ్‌లో హెలికాఫ్టర్‌ను సిద్దంగా ఉంచారు.

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న కర్రెలగుట్ట సమీపంలో తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు, మావోయిస్టులకు మధ్య కర్రెలగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు అరగంట పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టుగా సమాచారం. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింతగా పెంచారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఒకరిని ఏటూరు నాగారం మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సెక్రటరీ సుధాకర్‌గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది

కాగా, గత డిసెంబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. బుధవారం చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్​ ఆర్​ఎస్​ఐ గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. 

ఇక ఇటీవలి కాలంలో పోస్టర్లు, వాహనాల విధ్వంసంతో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నక్సల్స్ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌లతో ధీటుగా జవాబిస్తున్నారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్​పీఎఫ్​ బలగాల కూంబింగ్ కొనసాగుతూనే వుంది. దీనితో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే పోలీసులను టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. 
 

click me!