ప్ర‌శాంత్ కిశోర్ బీజేపీకి కోవ‌ర్టుగా ప‌ని చేస్తున్నాడు - బీహార్ సీఎం నితీష్ కుమార్

By team teluguFirst Published Sep 8, 2022, 9:02 AM IST
Highlights

ప్రశాంత్ కిశోర్ బీజేపీకి కోవర్టుగా పని చేస్తున్నాడని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు.పీకే కు పబ్లిసిటీ ఎలా పొందాలో తెలుసని, ఆయన దాని కోసం ఏమైనా చేస్తారని సీఎం మండిపడ్డారు. 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ లో అధికార మార్పిడిపై చేసిన వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ మండిప‌డ్డారు. ఆయ‌న బుధ‌వారం త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ కిషోర్ పై అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న పేరు ప్ర‌స్తావించ‌కుండా.. పీకేను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించాడు. ఆయన ప్రకటనలకు అర్థం లేదని అన్నారు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త బీజేపీ కోసం ర‌హ‌స్యంగా ప‌ని చేస్తున్నాడ‌ని తెలిపారు.

బెంగళూరు వరదలు.. దోశ తింటూ ఎంజాయ్ చేస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య... వీడియో వైరల్...

‘‘అత‌డు బీహార్‌లో చేయాలనుకున్నది చేయనివ్వండి. అతడి ప్రకటనలకు అర్థం లేదు. 2005 నుండి రాష్ట్రంలో (బీహార్) ఏమి జరిగిందో అతనికి ఏబీసీకి తెలుసా?’’ అని కుమార్ ప్రశ్నించారు. ‘‘వారికి పబ్లిసిటీ ఎలా తీసుకోవాలో, స్టేట్‌మెంట్లు ఇవ్వాలో తెలుసు.. వాళ్లే అందులో నిష్ణాతులు.. వారు ఇలా చెబుతూనే ఉంటారు. ఎవరైనా ఇలా మాట్లాడితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.. ఆయన మనసులో ఏదో ఒక‌టి ఉంటుంది. అది బీజేపీతో ఉండటమే కావచ్చు. బీజేపీకి రహస్య మార్గంలో సహాయం చేయండి’’ అని ఆయ‌న అన్నారు. 

డ్రెస్ వేసుకునే హక్కు ఉందంటే.. విప్పుకునే హక్కు కూడా ఉంటుందా? హిజాబ్ బ్యాన్‌పై విచారణలో సుప్రీంకోర్టు షాకింగ్

గత నెలలో బీజేపీ నేతృత్వంలోని బీజేపీతో తెగ‌దింపులు చేసుకొని ప్ర‌తిప‌క్షం అయిన ఆర్జేడీతో చేతులు క‌లిపి బీహార్ లో నితీష్ కుమార్ కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. బీహార్ లో మ‌రో సారి సీఎం ప‌ద‌విని అధిరోహించిన కుమార్ పై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

2024 ఎన్నికలకు బీజేపీ ఫార్ములా ఇదే.. టార్గెట్ 350 మిషన్‌లో వెనుకపడిన మంత్రులకు అమిత్ షా వార్నింగ్

నితీష్ కుమార్ వేసిన కొత్త అడుగుపై ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని కోరుతూ ఆన్ లైన్ లో పీకే ఒక పోల్ ను నిర్వ‌హించారు. ‘‘ గత పదేళ్లలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా నితీష్ కుమార్ చేసిన ఆరో ప్రయోగం ఇది. ఈసారి అయిన బీహార్ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తున్నారా? ’’ అంటూ ఆయ‌న పోల్ నిర్వ‌హించారు. దీనికి ‘అవును’, ‘కాదు’ అనే  ఆప్ష‌న్స్ ఇచ్చి..ఓటు వేయాల‌ని సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌ను కోరారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్-లెఫ్ట్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రజల మద్దతు లేదని ఎన్నికల వ్యూహకర్త పేర్కొన్నారు.
 

click me!