Nitish Kumar: అసెంబ్లీలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దూమరం చెలరేగుతోంది. దీంతో ఆయన వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు.
Nitish Kumar: బీహార్ అసెంబ్లీలో మహిళల గురించి సీఎం నితీశ్ కుమార్ చేసిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాభా నియంత్రణపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై జాన్ సూరజ్ చీఫ్, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు.
"తేజస్వి యాదవ్ ఏ పాఠశాలకు వెళ్లాడు. అతను ఏ పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ చదివాడు అనేది బహిరంగంగా తెలియజేయాలని అన్నారు. ప్రజలకు తెలిసినంత వరకు తేజస్వి 9వ తరగతి కూడా పాస్ కాలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాబట్టి అతను ఏ పాఠశాలకు వెళ్ళాడు? ఇది తేజస్వి యాదవ్‌కు ఉన్న జ్ఞానాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడని అన్నారు. స్కూల్ కు వేళ్తే.. సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా బోధిస్తారో తేజస్వికి ఎలా తెలిసేద"ని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు.
undefined
నితీష్ కుమార్ ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని, ఆయనకేమీ అర్థం కావడం లేదని, నిజానికి ఆయన రాజకీయాల్లో చివరి రోజులు లెక్కపెడుతున్నారని అన్నారు. తాను ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన సంతానోత్పత్తి గురించి ఏమి మాట్లాడినా.. అతని మానసిక స్థితిని చూపుతుందనీ,ఆయన ఏమి చెబుతున్నాడో అతనికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ?
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ ప్రక్రియలో మహిళల పాత్ర ఉందనీ, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోయిందో సీఎం వివరిస్తూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. గతంలో 4.3 శాతం ఉన్న సంతానోత్పత్తి రేటు నేడు 2.9 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మహిళలు చదువుకోవడంతో పాటు సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన ఉండటంతో .. ఏ సమయంలో ఏం చేయాలో వారికి బాగా తెలుసు. అందుకే జనాభా పెరగడం లేదని కామెంట్ చేశారు. మహిళలు చదువు కోవడం వల్లే.. జనాభా తగ్గుతుందనే ఆయన ఉద్దేశం.
సీఎం క్షమాపణలు
నితిష్ వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర విపక్షాలు, మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. 'నేను సిగ్గుపడటమే కాదు. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను ' అని నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. నితీష్ మాట్లాడుతూ ..మహిళా అక్షరాస్యతలో చాలా మెరుగుదల ఉందనీ, 51 శాతం నుంచి 73 శాతానికి పెరిగిందని తెలియజేశారు.
స్త్రీ విద్య స్థితి చాలా మెరుగుపడింది. మెట్రిక్ ఉత్తీర్ణత సంఖ్య 24 లక్షల నుంచి 55 లక్షలకు పెరిగిందని అన్నారు. అంతకుముందు ఇంటర్ ఉత్తీర్ణులైన మహిళల సంఖ్య 12. 55 లక్షలు ఉంటే.. ఇప్పుడు 42 లక్షలకు పైమాటే. పట్టభద్రుల మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.అయితే, ఈ వివాదాస్పద అంశంపై పెరుగుతున్న దుమారం చూసి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.