Train Accident: ఝార్సుగూడ నుండి సంబల్‌పూర్‌కు వెళ్తుండగా సరళ సమీపంలో గేదేను ఢీకొట్టి తర్వాత రైలు పట్టాలు తప్పింది. ఒక లైన్ బ్లాక్ చేయబడినప్పటికీ, ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
Another Rail Mishap: ఒడిశాలోని సంబల్ పూర్ లో బుధవారం సాయంత్రం మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలు ఝార్సుగూడ నుంచి సంబల్ పూర్ వెళ్తుండగా సరళ సమీపంలో గేదేను ఢీకొనడంతో పట్టాలు తప్పింది.
"సరళా-సంబల్ పూర్ సెక్షన్ లో ప్రయాణిస్తుండగా ఝార్సుగూడ - సంబల్ పూర్ మెము ప్యాసింజర్ స్పెషల్ రైలుకు చెందిన 08169 మేము ప్యాసింజర్ స్పెషల్ రైలు నాలుగు చక్రాలు సాయంత్రం 6.25 గంటల సమయంలో అకస్మాత్తుగా ట్రాక్ లోకి ప్రవేశించిన గేదేను ఢీకొనడంతో పట్టాలు తప్పాయి. ఫ్రంట్ లోకో నుంచి 4వ బోగీలోని ట్రాలీ పట్టాలు తప్పిందని" ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక లైన్ బ్లాక్ కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సంబంధిత రైల్వే అధికారులు పేర్కొన్నారు. సంబల్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం), అతని బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాయి. ట్రాక్ పునరుద్ధరణకు అవసరమైన సహాయ సామగ్రితో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ వైద్య సహాయంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకుంది. సంబల్పూర్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ (ఏఎఫ్ఓ) నేతృత్వంలోని ఒడిశా అగ్నిమాపక సేవల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పట్టాలు తప్పిన బోగీని తొలగించడంలో సహాయపడింది.
రెండో ఇంజిన్ తో రైలును సంబల్ పూర్ స్టేషన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అగ్నిమాపక శాఖ డీజీపీ డాక్టర్ సుధాంశు సారంగి తెలిపారు. రాత్రి 8.30 గంటలకు రైలు రాకపోకలకు 30 కిలోమీటర్ల వేగంతో ట్రాక్ ఫిట్ గా ఉందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.