
హైదరాబాద్: ఎఐసీసీ చీఫ్ సోనియా గాంధీ పార్టీ వ్యవహరాలను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకంలో పలు అంశాలను ప్రస్తావించారు. యూపీఏ1, యూపీఏ 2కు మధ్య చాలా తేడా ఉందని చెప్పారు.
మహారాష్ట్రలో సోనియాగాంధీ రాంగ్ లీడర్లపై ఆధారపడ్డారని ఆయన ఆ పుస్తకంలో ప్రస్తావించారు. తాను ఫైనాన్స్ మినిస్టర్ గా కొనసాగి ఉంటే మమత బెనర్జీ యూపీఏ నుండి వైదొలిగి పోయేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌డీఐ, సబ్సిడీ సిలిండర్ల సంఖ్యపై ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ తో మమత బెనర్జీ విభేధించారు. మన్మోహన్ కు లోక్ సభ నేతలతో సంబంధాల్లేవని ఆ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల నగదు రద్దు గురించి చర్చించలేదని ఆ లేఖలో రాశాడు. ఈ కఠినమైన చర్య ఆశ్చర్యం కల్గించలేదన్నారు.