బర్డ్ ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో ఆవులు మృతి

Published : Jan 06, 2021, 10:17 AM ISTUpdated : Jan 06, 2021, 10:21 AM IST
బర్డ్ ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో ఆవులు మృతి

సారాంశం

 మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆవులు కుప్పలుకుప్పలుగా మృత్యువాతపడ్డాయని అధికారులు తెలిపారు. 

కరోనా మహమ్మారితో నే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో బర్డ్ ఫ్లూ మరింత భయపెడుతోంది. ఇప్పటికే కేరళ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం మొదలైంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ కూడా ప్రకటించేశారు. కాగా.. తాజాగా మధ్యప్రదేశ్ లో వందలాది ఆవులు మృత్యువాతపడ్డాయి. ఈ ఆవులన్నీ బర్డ్ ఫ్లూ కారణంగానే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఇండోర్ సహా.. మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆవులు కుప్పలుకుప్పలుగా మృత్యువాతపడ్డాయని అధికారులు తెలిపారు. చనిపోయిన ఆవుల్లో ఎవైన్ ఇన్ఫ్లూయంజా , హెచ్5ఎన్8 వైరస్ లు కనుగొన్నట్లు చెప్పారు.

మొత్తంగా రాష్ట్రంలో 376 ఆవులు చనిపోయాయి. కాగా.. ఇండోర్ లో 142, మండాసూర్ లో 100, ఆగర్-మల్వా ప్రాంతంలో 112, ఖర్గోన్ లో 13, సెహోర్ లో 9 ఆవులు చనిపోయినట్లు చెప్పారు. కాగా.. ఇలానే వదిలేస్తే.. ఆవులు మరిన్ని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిని కంట్రోల్ చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu