
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సందర్శించి వెళ్లిన ఓ కాలేజీని అక్కడి విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని ఎం.విశ్వేశ్వరయ్య (ఎంవీ) ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ విద్యార్థులు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తీర్థం అనుకొని నాటు సారా తాగిన గుజరాత్ మంత్రి రాఘవ్ జీ పటేల్ .. వీడియో వైరల్..
ఆగస్టు 8వ తేదీన ఆ కాలేజీ క్యాంపస్ లోని ప్రోగ్రామ్ హాల్ లో ‘థియేటర్, సినిమా, సమాజంపై చర్చ’ కార్యక్రమం జరిగింది. దీనికి ప్రకాశ్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్కడి చర్చలో పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం అక్కడున్న కొందరు విద్యార్థులకు నచ్చలేదు. కాలేజీ లోపల ప్రైవేటు కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అనంతరం క్యాంపస్ చుట్టూ గోమూత్రాన్ని చల్లారు.
కార్టూన్లు చూస్తూ టీవీ సెట్ టాప్ బాక్స్ ను తాకిన 4 ఏళ్ల బాలుడు.. కరెంట్ షాక్ రావడంతో మృతి
ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నినదాదాలు..
ప్రకాశ్ రాజ్ ను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ‘తుక్డే గ్యాంగ్, ప్రకాశ్ రాజ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ విద్యార్థులకు స్థానిక బీజేపీ నేత ధర్మ ప్రసాద్ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. అయితే భద్రావతిలో ఉన్న ఈ కాలేజీ వెలుపలకు బయటి నుంచి ఆందోళనకారులు ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వారికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కాగా.. ఈ నిరసన కాలేజీ విద్యార్థులు, బయటి వ్యక్తుల కలయికతో జరిగిందని శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే ఇందులో ప్రమేయం ఉన్న బయటి వ్యక్తి నేపథ్యం ఏంటని ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు. కాగా.. హిందీ, తమిళం, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలలో ప్రకాశ్ రాజ్ ప్రముఖ నటుడిగా ఉన్నారు. అయితే ఆయన గత కొంత కాలం నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.