అయోధ్యలో ప్రారంభించబోతున్న రామ మందిరం, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, యూపీ ఏడీజీపీలను బాంబు పెట్టి చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ మెయిల్స్ ముస్లింల పేరుతో ఉన్నాయి. కానీ, దర్యాప్తులో వారు ముస్లింలు కాదని తెలియవచ్చింది.
Ayodhya: అయోధ్య రామ మందిరాన్ని బాంబు పెట్టి పేల్చేస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌నూ బాంబుతో లేపేస్తామని ఇద్దరు ముస్లిం పేర్ల ఐడీలతో బెదిరించారు. కానీ, పోలీసుల దర్యాప్తులో వారు ముస్లింలు కాదని తేలింది. రాజకీయ మైలేజీ కోసం ఓ చోటా లీడర్ ఇద్దరు యువకులకు సూచనలు చేశారని, ఆయన సూచనల మేరకు వీరిద్దరూ ఆ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఇద్దరు నిందితులు తాహర్ సింగ్, ఓం ప్రకాశ్ మిశ్రాలను డిసెంబర్ 3వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు.
యోగి ఆదిత్యానాథ్, రామ మందిరం, అదనపు డీజీపీ అమితాబ్ యశ్, సోషల్ యాక్టివిస్ట్ దేవేంద్ర తివారీలకు జుబేర్ ఖాన్, ఆలం అన్సారీ ఖాన్ అనే నకిలీ పేర్లతో బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వీరిద్దరూ ఐదేవేంద్ర ఆఫీసు అనే ట్విట్టర్ హ్యాండిలను ఉపయోగించినట్టు స్టేట్‌మెంట్‌లో చెప్పారు.
మాస్టర్‌మైండ్ ముస్లిం కాదు..
ఈ మొత్తం బెదిరింపుల ఎపిసోడ్‌ను దేవేంద్ర తివారీ అనే సోషల్ యాక్టివిస్టే ప్లాన్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తారా సింగ్, మిశ్రాలకు ఈ బెదిరింపు మెయిల్స్ తనతోపాటు మిగిలిన వారికీ పంపాలని సూచించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి మీడియా అటెన్షన్, రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నించారు.
Also Read: Kodali Nani: కాంగ్రెస్‌లోకి షర్మిల.. కొడాలి నాని సంచలనం.. ‘జగన్‌కు క్షమాపణలు చెప్పాలి’
తివారీ రెండు ఎన్జీవోలు భారతీయ కిసాన్ మంచ్, భారతీయ గో సేవా పరిషద్‌లను నడుపుతున్నాడు.
దేవేంద్ర తివారీ ఇలా తన మైలేజీ కోసం నకిలీ బెదిరింపులకు పాల్పడటం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ చాలా సార్లు ఈ కుట్రలు చేశాడని ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ ఎక్స్‌లో అందుకు సంబంధించిన వివరాలను పోస్టు చేశారు.