ఉజ్జయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ చీరకట్టుతో కిటికీ గుండా ట్రైన్‌లోకి దూరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral: ట్రైన్, రద్దీ వేరు చేయలేని పదాలుగా మారాయి. ఏ ఎక్స్‌ప్రెస్ చూసినా రద్దీ సాధారణంగా కనిపిస్తుంది. ట్రైన్ వచ్చీరాగానే తోసుకుంటూ లోపలికి వెళ్లడమూ అంతే సాధారణం. అయితే.. మహిళలను సైతం ట్రైన్‌లోకి కిటికీ గుండా పంపించే రద్దీ కేవలం ఉజ్జయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కే సాధ్యమైంది. ఓ యువతి ట్రైన్‌లోకి కిటికీ గుండా ఎక్కింది. ఆ వెంటనే చీరకట్టిన ఓ మహిళ అదే కిటికీ గుండా లోనికి తోసుకుని వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
ఉజ్జయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు అసాధారణ స్థాయిలో వచ్చారు. ప్లాట్ ఫామ్ పైనే కాదు.. ట్రాక్‌లపైకి దిగి మరీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనకు ఆ వీడియోలో కనిపిస్తాయి. అంతలోనే ట్రైన్ వచ్చింది. అందరూ తోసుకుంటూ ట్రైన్ చుట్టూ మూగారు. ట్రైన్‌లోకి ఎక్కే డోరు ముందు ఇసుక వేస్తే రాలని జనం చేరారు.
ప్లాట్‌ఫామ్‌కు ఎదురుగా ట్రైన్‌కు అవతలి వైపున నిలుచున్న ప్రయాణికులూ లోనికి వెళ్లడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అప్పుడే ట్రైన్ ఎమర్జెన్సీ కిటికీని మొత్తంగా తెరిచారు. ఆ తర్వాత ఓ యువతి రెండు కాళ్లను లోపలికి వేసి ఆ కిటికీ గుండా ట్రైన్‌లోకి జారుకుంది. ఆ వెంటనే మరో మహిళ అదే విధంగా కిటికీ ద్వారా ట్రైన్ ఎక్కింది.
Windows are just small doors anyway. pic.twitter.com/WRgY6cZRJE
— Cow Momma (@Cow__Momma)ఈ ఫుటేజీ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రయాణికుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు ఈ సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖను ట్యాగ్ చేశారు. మరికొందరు ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని అదనంగా ట్రైన్లను జోడించాలని ప్రధాని మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విణీ వైష్ణవ్ ట్విట్టర్ హ్యాండిళ్లకు ట్యాగ్ చేశారు.
Also Read: Mudragada: కాపు నేత ముద్రగడకు వైసీపీ షాక్? ఊరించి ఉసూరుమనిపించిందా?
మరికొందరు హాస్యభరిత వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్.. ఎమర్జెన్సీ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని విండో ట్రైనింగ్ అంటారని మరొకరు కామెంట్ చేశారు.
హిట్ అండ్ రన్ చట్టాలు కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్, బస్సు డ్రైవర్లు ఆందోళన చేయడం మూలంగా ఉజ్జయిన్‌కు వచ్చిన భక్తులకు బస్సులు కరువయ్యాయి. దీనికితోడు ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు కూడా స్ట్రైక్ చేయడంతో ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.