ప్రముఖ అస్సామీ నటుడు నిపోన్ గోస్వామి కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, సీఎం హిమంత శర్మ

By team teluguFirst Published Oct 27, 2022, 4:04 PM IST
Highlights

అస్సామీ భాషలో ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించిన నిపోన్ గోస్వామి ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన గురువారం చనిపోయారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం హిమంత బిశ్వ శర్మ విచారం వ్యక్తం చేశారు. 

ప్రముఖ అస్సామీ నటుడు నిపోన్ గోస్వామి (80) గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అక్టోబర్ 24వ తేదీన హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గోస్వామి నేడు చనిపోయారు. ఆయనకు కుమారుడ, కోడలు ఉన్నారు.

ప్రీ వెడ్డింగ్ షూట్‌లో ధూమ్ సినిమానే దించేశారు.. బైక్ పై స్టంట్ చేసిన పెళ్లి జంట (వీడియో) 

నిపోన్ గోస్వామి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, అస్సాం సీఎం హిమంత శర్మ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అస్సామీ చిత్ర పరిశ్రమకు మార్గదర్శకమైన కృషి చేసిన నిపోన్ గోస్వామి మరణంతో బాధపడ్డాను. ఆయన చేసిన వైవిధ్యభరితమైన రచనలు పలువురు సినీ ప్రేమికులకు గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి - ప్రధాని నరేంద్ర మోడీ ’’ అని పీఎంవో ట్వీట్ చేసింది.

Saddened by the passing away of Shri Nipon Goswami, who made a pioneering contribution to the Assamese film industry. His diverse works will be remembered by several film lovers. Condolences to his family and admirers. Om Shanti: PM

— PMO India (@PMOIndia)

సీఎం హిమంత శర్మ కూడా గోస్వామి కుటుంబానికి సంతాపం తెలిపారు. భావోద్వేగమైన ట్వీట్ లో.. కాకాడెయుతా నతి ఔర్ హతి చిత్రంలో గోస్వామితో కలిసి పనిచేసిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ‘‘ ఎవర్ గ్రీన్ నటుడు నిపోన్ గోస్వామి మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. బాలనటిగా ‘కాకాడెయుతా నాటీ ఔర్ హతి’ చిత్రంలో నటిస్తున్నప్పుడు అస్సాంలోని ఉత్తమ నటుల్లో ఒకరి సమక్షంలో ఉండటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ’’ అని ఆయన పేర్కొన్నారు.

অসমীয়া ছবি জগতৰ চিৰসেউজ অভিনেতা নিপন গোস্বামীদেৱেৰ পৰলোক গমনৰ বাতৰি পাই মই ব্যথিত হৈ পৰিছোঁ৷ শৈশৱতে 'ককাদেউতা নাতি আৰু হাতী' নামৰ চলচ্চিত্ৰখনত অভিনয় কৰাৰ সময়তে অসমৰ অন্যতম শ্ৰেষ্ঠ অভিনেতাগৰাকীৰ মই সান্নিধ্য লাভ কৰি ধন্য হৈছিলোঁ৷ pic.twitter.com/wsS4YS2Ma8

— Himanta Biswa Sarma (@himantabiswa)

కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా గోస్వామి మృతికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఆ నటుడి ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ అస్సామీ సినిమా పోల్స్టార్ ఇక లేరు. ప్రముఖ నటుడు నిపోన్ గోస్వామి మరణవార్త విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. 1960ల నుండి స్టార్ అయిన నిపోన్  ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించాడు. ఆయన మరణం ఒక స్వర్ణ యుగానికి ముగింపును తెస్తుంది.’’ అని పేర్కొన్నారు.

The polestar of Assamese cinema is no more. Deeply saddened to learn about the demise of veteran actor Nipon Goswami. A star since the 1960s, Nipon da had captivated the hearts of audience and his death brings an end to a golden era. pic.twitter.com/fxjcmUrszr

— Sarbananda Sonowal (@sarbanandsonwal)

రంగస్థల కళాకారుడిగా తన నట ప్రయాణాన్ని ప్రారంభించిన నిపోన్ గోస్వామి..  సినిమా నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఆయన తన కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో నటించారు. పియోలి ఫుకన్, సంగ్రామ్, ముకుట, బ్రిష్టి, అపరూప, జిబోన్ సురభి, బోరోలార్ ఘోర్, జిల్మిల్ జోనక్, గానే కి ఆనే, ది అండర్ వరల్డ్ మొదలైనవి ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు. ఆయన చివరిగా అస్సామీ చిత్రం రజని బర్మన్ రచించిన లంకకాండలో నటించారు. 

click me!