కేజ్రీవాల్ సూచనలో తప్పేముంది.. కరెన్సీ నోట్లపై లక్ష్మి దేవి ఫొటోల ప్రకటనను సమర్థించిన మనీష్ తివారీ

By team teluguFirst Published Oct 27, 2022, 3:18 PM IST
Highlights

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవీ, వినాయకుడి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఆయనను విమర్శిస్తుండగా.. మరి కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. 

కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీ దేవి చిత్రాలను ముద్రించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మద్దతుగా నిలిచారు. ఆయన సూచనను సమర్ధించారు. కేజ్రీవాల్ చెప్పిన విషయంలో తప్పేంలేదని అన్నారు. అలాగే నోట్లపై డాక్టర్ అంబేద్కర్ ఫొటోను కూడా ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. 

కేజ్రీవాల్ ప్రకటనకు తాను వ్యతిరేకం కాదని మనీష్ తివారీ అన్నారు. భారతీయ సంస్కృతిలో గణేశుడు, లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ముఖ్యమైన పని చేసే ముందు అందరం వారిని ప్రార్థిస్తామని తెలిపారు. కాబట్టి ఆయన నా చెప్పింది సరైనదే అని అన్నారు. కరెన్సీ నోట్లపై ఆ దేవుళ్ల చిత్రాలను ఉంచేందుకు వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.

ఏడుగురు భారతీయ జాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నావికాదళం

‘‘భారత కరెన్సీ సార్వభౌమత్వానికి ప్రతిబింబం. డాక్టర్ అంబేడ్కర్ ఆ సార్వభౌమత్వానికి రాజ్యాంగ హోదా ఇచ్చారు. డాక్టర్ అంబేద్కర్, గణేశ్-లక్ష్మీ దేవి చిత్రాలను ఉంచేందుకు వెసులుబాటు ఉంది’’ అని తివారి అన్నారు. ‘‘ కొత్త కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహిబ్ అంబేద్కర్ ఫోటో ఉంచకూడదు. ఓ వైపు మహాత్ముని (గాంధీ) మరొక వైపు డాక్టర్ (బి.ఆర్. అంబేద్కర్) ఉంచాలి.’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. కరెన్సీపై లక్ష్మీదేవి, విఘ్నహర్త గణేశుడి ఫొటో పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం డిమాండ్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ డిమాండ్‌పై రాజకీయాల్లో ఒక్క సారిగా చర్చకు దారి తీసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కూడా ఈ విషయంలో స్పందించాయి.

అండమాన్‌లో జాబ్ ఫర్ సెక్స్ రాకెట్.. ఇద్దరు ప్రభుత్వ అధికారుల భాగోతం బట్టబయలు

హర్యానా హోం మంత్రి, బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత అనిల్ విజ్ ట్వీట్ చేస్తూ.. ఎట్టకేలకు ఈ విషయం లక్ష్మీ పూజారి కేజ్రీవాల్‌ నోట వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా స్పందించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం దీపావళి రోజు ఢిల్లీలో పటాకులు కాల్చడాన్ని నిషేధిస్తూ పత్వా జారీ చేశారని గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం హిందూ వ్యతిరేకిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌ను ఎన్నికల హిందువు అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా విమర్శించారు. ఆయన హిందువుగా నటిస్తున్నారని తెలిపారు.

15 ఏళ్లుగా బీజేపీ ఏం చేసిందో చూపించడం సిగ్గుచేటుగా ఉంది.. : ఘాజీపూర్ చెత్తకుప్పను సందర్శించిన కేజ్రీవాల్

ఈ విషయంలో కాంగ్రెస్ కు చెందిన మరో నేత గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకునే అన్ని నిర్ణయాలను బీజేపీ తీసుకుంటుందని అన్నారు. ఇది ఓటు రాజకీయాల డిమాండ్ అని, నోట్ల రద్దు ద్వారా బీజేపీ లక్ష్మీదేవిని అవమానించిందని అన్నారు. అప్పటి నుంచి జీడీపీ మళ్లీ గాడిలో పడలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్ లక్ష్మీదేవిని పూజించాలని, ఆమెకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం సూచన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అని అన్నారు. ‘‘ ఆయన (కేజ్రీవాల్) బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు చెందిన బీ టీమ్. ఆయనకు ఏ అవగాహన లేదు. ఇది ఆయన ఓటు బ్యాంకు రాజకీయం. ఒకవేళ ఆయన పాకిస్తాన్ కు వెళితే తాను పాకిస్తానీని కూడా చెప్తాడు. కాబట్టి ఆయనకు ఓటు వేయాలని అడుగుతాడు ’’ అని ఆయన ఆరోపించారు. 

click me!