లాక్ డౌన్ అతిక్రమించి కారులో షికారు.. సినీ నటి పూనమ్ పై కేసు

Published : May 11, 2020, 08:19 AM ISTUpdated : May 11, 2020, 09:39 AM IST
లాక్ డౌన్ అతిక్రమించి కారులో షికారు.. సినీ నటి పూనమ్ పై కేసు

సారాంశం

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పూనం పాండేపై ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదు చేసి బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు.   

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే.. కొందరు మాత్రం అధికారులు ఎంతమొత్తుకున్నా లాక్ డౌన్ ని అతిక్రమిస్తూనే ఉన్నారు. ఇలా అతిక్రమించిన వారిలో ప్రముఖ మోడల్, సినీ నటి పూనమ్ పాండే కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది.

కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్ నిబంధనలను పూనం పాండే ఉల్లంఘించి తన బీఎండబ్ల్యూ కారులో మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పూనం పాండేపై ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదు చేసి బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. 

పూనం పాండేతో పాటు శామ్ అహ్మద్ బాంబేపై కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు ఇన్ స్పెక్టరు మృత్యుంజయ్ హీరేమత్ చెప్పారు. పూనం పాండే గతంలో ప్రముఖనటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేశారు. పూనం పాండే నషా, ఆగయా హీరో, ద జర్నీ ఆఫ్ కర్మ సినిమాల్లో నటించారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu