ఎమ్మెల్యే పదవికి మల్లాడి కృష్ణారావు రాజీనామా: కొట్టి పారేసిన సీఎం, స్పీకర్

By narsimha lodeFirst Published Feb 15, 2021, 9:27 PM IST
Highlights

పుదుచ్చేరిలోని యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని పాండిచ్చేరి సీఎం, స్పీకర్ లు ప్రకటించారు.

:పుదుచ్చేరిలోని యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని పాండిచ్చేరి సీఎం, స్పీకర్ లు ప్రకటించారు.

మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడ కృష్ణారావు రాజీనామా అందించినట్టుగా ప్రచారం సాగింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీనే ఆరోగ్యశాఖ మంత్రి పదవికి కృష్ణారావు రాజీనామా చేశారు. అయితే సీఎం మాత్రం కృష్ణారావు రాజీనామాను ఆమోదించలేదు.

ఈ తరుణంలో సోమవారం నాడు మరోసారి మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడ ఆయన రాజీనామా చేసినట్టుగా ప్రచారం సాగింది.ఈ ప్రచారంలో వాస్తవం లేదని సీఎం, స్పీకర్ లు ప్రకటించారు.కృష్ణారావు నుండి తనకు ఎలాంటి రాజీనామా పత్రం అందలేని స్పీకర్ వీపీ శివకొలుందు స్పష్టం చేశారు. ఇదే అభిప్రాయాన్ని కూడ సీఎం తెలిపారు.

ఇదిలా ఉంటే స్పీకర్ కార్యాలయానికి ఇవాళ ఎలాంటి రాజీనామా పత్రాలు అందలేదని స్పీకర్ కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. రాష్ట్ర ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొంది.
 

click me!