మొబైల్‌ను ఎత్తుకెళ్లిన దొంగ: 3 కి.మీ వెంటాడి ఫోన్‌ను దక్కించుకొన్నాడు

Published : Feb 15, 2021, 08:00 PM IST
మొబైల్‌ను ఎత్తుకెళ్లిన దొంగ: 3 కి.మీ వెంటాడి ఫోన్‌ను దక్కించుకొన్నాడు

సారాంశం

మొబైల్ ను దొంగతనం చేసి పారిపోతున్న దొంగను వెంటాడి ఫోన్ ను తిరిగి దక్కించుకొన్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

చెన్నై: మొబైల్ ను దొంగతనం చేసి పారిపోతున్న దొంగను వెంటాడి ఫోన్ ను తిరిగి దక్కించుకొన్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

చెన్నై పెరూర్‌ చెందిన పార్తిబన్ అనే వ్యక్తి వడ పెరుంబాక్కమ్-మాధవరమ్ రోడ్డులో బైక్ ఆపి,  ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ దొంగ పార్తిబన్ చేతిలోని ఓ ఫోన్ ను లాక్కొని పరుగెత్తాడు.

పార్తిబన్  ఆ దొంగ వెంట పరుగెత్తాడు. సుమారు 3 కి.మీ. వెంటాడాడు.  దొంగకు అతి దగ్గరగా అతను వెళ్లాడు. దీంతో దొంగ భయపడ్డాడు. వెంటనే ఫోన్ ను కింద పారేసి పారిపోయాడు.  దొంగ వదిలివెళ్లిన ఫోన్ ను తీసుకొన్న పార్తిబన్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న దర్యాప్తు చేస్తున్నారు.

తనను పార్తిబన్ వెంటాడుతున్న విషయాన్ని గమనించిన దొంగ భయంతో ఫోన్ ను వదిలేసినట్టుగా పార్తిబన్ చెప్పారు. ఫోన్ దక్కించకొన్న తర్వాత దొంగకు శిక్ష పడాలనే ఉద్దేశ్యంతో పార్తిబన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 

PREV
click me!

Recommended Stories

Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu
Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు