కాలుష్య నియంత్రణే లక్ష్యం.. 2025 నాటికి ఢిల్లీలో 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులు - అరవింద్ కేజ్రీవాల్

Published : Jan 02, 2023, 03:25 PM IST
కాలుష్య నియంత్రణే లక్ష్యం..  2025 నాటికి ఢిల్లీలో 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులు - అరవింద్ కేజ్రీవాల్

సారాంశం

ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై దృష్టి పెడుతోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2025 నాటికి దేశ రాజధానిలో 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై నడుస్తాయని చెప్పారు. 

2025 నాటికి ఢిల్లీలోని 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ-బస్సుల కొనుగోలు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. సోమవారం రాజ్‌ఘాట్ డిపోలో 50 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఢిల్లీ ప్రభుత్వం 2023లో 1,500 బస్సులను కొనుగోలు చేస్తుందని చెప్పారు. 2025 నాటికి 6,380 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామని అన్నారు.

అగ్నిపథ్ స్కీమ్ లో ఫస్ట్ బ్యాచ్ కు మొదలైన ట్రైనింగ్.. ఎక్కడంటే ?

‘‘మా వద్ద ఇప్పుడు 300 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఢిల్లీలో 7,379 బస్సులు ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్నాయి. గడిచిన 75 ఏళ్లలో ఇదే అత్యధికం. చాలా సంవత్సరాలుగా కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 7,379 బస్సుల్లో 4,000కు పైగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, 3,000కు పైగా డీఐఎమ్‌టీఎస్ ద్వారా నడుపుతున్నాయి’’ అని ఆయన అన్నారు. 

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 100 ఎలక్ట్రిక్ ఫీడర్ బస్సులు నడుపుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. కానీ వాటిని నడపలేకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం కార్పొరేషన్ బస్ ఫ్లీట్‌ను స్వాధీనం చేసుకుంటోందని ఆయన అన్నారు.‘‘2025 నాటికి ఢిల్లీ రోడ్లపై 10,000 బస్సులు ఉంటాయి. వాటిలో 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. ఇది కాలుష్యాన్ని తగ్గించడంలో భారీ అడుగు’’ అని ఆయన చెప్పారు.

దెయ్యం వదిలిస్తానని నమ్మించి మైనర్ బాలికపై మాంత్రికుడి అత్యాచారం.. యూపీలో ఘటన

డిపోలలో ఈ-బస్సులకు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే మూడింటిలో ఇలాంటి సదుపాయం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నాటికి 17 బస్‌ డిపోల విద్యుదీకరణ పనులు పూర్తి చేస్తామని, డిసెంబర్‌ నాటికి 36 బస్‌ డిపోలకు విద్యుదీకరణ చేస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు. కాగా.. కొత్తగా ప్రారంభించిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్యానిక్ బటన్లు, జీపీఎస్, కెమెరాలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !