air pollution: కాలుష్యంతో భార‌త్ లో 23.5 ల‌క్ష‌ల మంది మృతి.. లాన్సెట్ నివేదిక ఆందోళన !

By Mahesh RajamoniFirst Published May 19, 2022, 11:43 AM IST
Highlights

Lancet Planetary Health journal: ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కాలుష్యాల కారణంగా 2019లో  దాదాపు 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా ఒక్క భారత్ లోనే 23.5 లక్షల మంది కాలుష్యానికి బ‌ల‌య్యారు. 
 

Pollution in India: యావ‌త్ ప్ర‌పంచాన్ని కాలుష్య భూతం ప‌ట్టిపీడిస్తోంది. దీని కార‌ణంగా ప్ర‌తి సంవ‌త్స‌రం ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఇలా పలు రకాల కాలుష్యాలు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితుల‌ను అరిక‌ట్ట‌డానికి మెరుగైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో మ‌రింత ప్ర‌మాదం దాపురిస్తున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కాలుష్యాల కారణంగా 2019లో 9 మిలియన్ల (90 లక్షల మంది) మరణించారని ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్ త‌న అధ్య‌య‌నంలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కాలుష్యాల కారణంగా 2019లో 9 మిలియన్ల (90 లక్షల మంది) ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా ఒక్క భారత్ లోనే 23.5 లక్షల మంది కాలుష్యానికి బ‌ల‌య్యారని తెలిపింది. 

ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్ త‌న అధ్య‌య‌నంలో పేర్కొన్న మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి..  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ కాలుష్యంతో అకాల మృత్యువు బారిన పడుతున్నారని ఆ నివేదిక తెలిపింది. ముఖ్యంగా గాలి కాలుష్యం కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని వెల్ల‌డించింది. 2019లో ప్రపంచంలోనే అత్యధికంగా అంచనా వేయబడిన కాలుష్య సంబంధిత మరణాలలో భారతదేశం మొద‌టి స్థానంలో ఉంద‌ని లాన్సెట్ నివేదిక నొక్కి చెప్పింది. దాదాపు 2.2 మిలియన్ల మరణాలతో చైనా కంటే ముందుంది.  అయితే కాలుష్యం మొత్తం దేశంలోని 93% WHO మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉంది. గృహ కాలుష్యం మరియు కాలుష్యం తగ్గింపు ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పర్యవేక్షణ మరియు ప్రణాళికలో గణనీయమైన పెట్టుబడులు రావ‌డం లేద‌ని పేర్కొంది. 

ప్రపంచవ్యాప్తంగా 2015లో మాదిరిగానే 2019లో కాలుష్యం కారణంగా తొమ్మిది మిలియన్ల మరణాలు సంభవించాయి. మొత్తం మరణాలలో దాదాపు 75% పరిసర వాయు కాలుష్యం కారణంగా ఉంది. చైనాలో అత్యధికంగా 1.8 మిలియన్ల మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్లకు పైగా మరణాలు ఇప్పుడు విషపూరిత రసాయన కాలుష్యం (సీసంతో సహా) కారణంగా సంభవించాయి. 2000 నుండి 66% పెరుగుదల న‌మోదైంద‌ని నివేదిక పేర్కొంది. కాలుష్యం.. వ్యాధి, అకాల మరణాలకు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ప్రమాద కారకంగా ఉంద‌నీ, ముఖ్యంగా తక్కువ, మధ్య-ఆదాయ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న‌ద‌ని తెలిపింది. 

కాలుష్య ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ప్ర‌భావం చూపుతున్న‌ద‌నీ, మాన‌వాళి మ‌నుగ‌డ‌కు సైతం స‌వాలు విసురుతున్న‌ద‌ని లాన్సెట్ నివేదిక పేర్కొంది. పేద, మధ్య తరగతి ఆదాయాలు కలిగిన దేశాలపై ఈ ప్రభావం అధికంగా ఉందని జెనీవా స్విట్జర్లాండ్‌ గ్లోబల్‌ అలయన్స్‌ ఆన్‌ హెల్త్‌ అం్‌ పొల్యూషన్‌, అధ్యయన కర్త రిచర్డ్‌ ఫుల్లర్‌ తెలిపారు. ఆరోగ్య నష్టంతో పాటు సామాజిక, ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ అభివృద్ధి ఎజెండాలో కాలుష్య నివారణను పలు దేశాలు పట్టించుకోవడం లేదని అన్నారు. బంగ్లాదేశ్‌, ఇథియోపియా దేశాల్లో కాలుష్యం కారణంగా 1,42,883 మరణాలు సంభవించ‌గా,  142,883 మరణాలతో మొత్తం కాలుష్య మరణాల్లో టాప్‌-10 దేశాల్లో అమెరికా 7వ స్థానంలో ఉంది. 
 

click me!