
ఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటగా మిజోరాం, ఛత్తీస్ గడ్ లలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఛత్తీస్ గడ్ లో తొలి విడతలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరాంలో ఒకే విడతలో 40 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు వరకు పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.