బ్యాంక్ ఫ్రాడ్ కేసు : పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా అరెస్ట్...

By SumaBala Bukka  |  First Published Nov 7, 2023, 6:46 AM IST

లూథియానాలోని ఓ బ్యాంకు ఫిర్యాదు మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై పంజాబ్ ఎమ్మెల్యే, ప్రముఖ వ్యాపారవేత్త జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాతో పాటు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. 


లుధియానా : రూ. 40.9 కోట్ల బ్యాంకు మోసం కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్మజ్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసింది. మలేర్‌కోట్ల రోడ్డులోని ఓ కాలనీలో ఆప్‌ ఎమ్మెల్యే బ్లాక్‌ ప్రెసిడెంట్‌లతో సహా ఆప్‌ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా, ఈడీ దాడులు చేసింది.
ఏఏపీ సమన్లను పాటించనందుకు ఆప్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు ED వర్గాలు తెలిపాయి.

40 కోట్ల బ్యాంకు మోసంపై పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు, సంతకాలు చేసిన 94 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆయనను జలంధర్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉంచారని, మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు.

Latest Videos

undefined

Earthquake: ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 5.6 తీవ్రత న‌మోదు

మధ్యాహ్నం సమయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా రెండు వాహనాల్లో ఈడీ అధికారులు అక్కడికి చేరుకుని గజ్జన్ మజ్రాను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. సుమారు గంటపాటు ఆప్ ఎమ్మెల్యేను విచారించిన ఈడీ.. ఆ తరువాత ఆయనను వాహనంలో ఏజెన్సీలోని జలంధర్ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.

ఈడీ విచారణకు హాజరుకావాలని ఆప్ ఎమ్మెల్యేకు చాలాసార్లు సమన్లు ​​జారీ చేశామని.., అయితే, గజ్జన్ హాజరు కాలేదని స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ తరువాత ఏజెన్సీ అతనికి నవంబర్ 4న సమన్లు ​​జారీ చేసిందని.. ఆప్ ఎమ్మెల్యే దానికి కూడా హాజరు కాలేదని ఆరోపించారు. దీంతోనే ఈ చర్య తీసుకుందని వారు తెలిపారు.

సమాచారం ప్రకారం... ఆప్ ఎమ్మెల్యే, అతని సోదరులు 2011, 2014ల మధ్య బ్యాంకు నుండి అనేక రుణాలు తీసుకున్నారు. కానీ వాటిని దేనికోసం తీసుకున్నారో వాటికి కాకుండా ఇతర ప్రయోజనాల కోసం "ఉపయోగించబడ్డాయి"  అని ఈడీ, సీబీఐ ఆరోపించింది. లూథియానాలోని ఓ బ్యాంకు ఫిర్యాదు మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై ఆయనతో పాటు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆప్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. 

click me!