విపక్షాలకు సుప్రీం షాక్: ఈడీ, సీబీఐ దుర్వినియోగంపై 14 పార్టీల పిటిషన్ తిరస్కరణ

Published : Apr 05, 2023, 03:51 PM ISTUpdated : Apr 05, 2023, 05:18 PM IST
విపక్షాలకు  సుప్రీం షాక్: ఈడీ, సీబీఐ దుర్వినియోగంపై  14 పార్టీల  పిటిషన్ తిరస్కరణ

సారాంశం

ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తుల విషయమై  14 విపక్ష పార్టీలు దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ  దర్యాప్తులపై  14 విపక్ష పార్టీలు  దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు  బుధవారంనాడు తిరస్కరించింది. రాజకీయ ప్రత్యర్ధులపై  సీబీఐ, ఈడీ  , ఐటీ వంటి  దర్యాప్తు సంస్థలను  కేంద్ర ప్రభుత్వం  ఏకపక్షంగా  ఉపయోగిస్తుందని  విపక్షాలు  ఆరోపించాయి.  కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలొని  14 పార్టీలు  ఈ పిటిషన్ దాఖలు  చేశాయి. ఈ పిటిషన్ ను  స్వీకరించడానికి  సుప్రీంకోర్టు  బుధవారంనాడు నిరాకరించింది. అత్యున్నత  న్యాయస్థానం  పిటిషన్ ను స్వీకరించేందుకు  నిరాకరించడంతో  విపక్షాలు  పిటిషన్ ను ఉపసంహరించుకున్నాయి. 

also read:ఈడీ, సీబీఐ దర్యాప్తులు: సుప్రీంకోర్టులో 14 విపక్ష పార్టీల పిటిషన్

సుప్రీంకోర్టు  చీఫ్ జస్టిస్  డివై  చంద్రఛూడ్  నేతృత్వంలోని  త్రిసభ్య ధర్మాసనం  ఈ పిటిషన్ ను   విచారించింది.  2014లో  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన  మోడీ సర్కార్   కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం  చేస్తుందని  కాంగ్రెస్ నేతృత్వంలోని  14 పార్టీలు  ఆ పిటిషన్ లో ఆరోపణలు చేశాయి.  సీబీఐ, ఈడీ దాఖలు  చేసిన కేసుల్లో ఎక్కువగా  విపక్ష పార్టీలకు చెందిన నేతలపైనే  ఉన్నాయని విపక్షాలు  ఆ పిటిషన్ లో  పేర్కొన్నాయి. 

తాను  భవిష్యత్తు  కోసం  మార్గర్శకాలను  అడుగుతున్నానని  విపక్ష పార్టీల తరపు  న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి  సుప్రీంకోర్టును కోరారు.  2014కు ముందు  ఆ తర్వాత  ఈడీ, సీబీఐ కేసుల్లో   భారీ పెరుగుదల ఉందని సింఘ్వి  చెప్పారు. బెయిల్  మార్గదర్శకాలను  అడుగుతున్నానన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?