వెయ్యి కోట్ల గోల్డ్ స్కాం: రూబీ జ్యూయల్లరీస్ సంస్థల్లో సోదాలు

Published : Feb 03, 2021, 04:48 PM IST
వెయ్యి కోట్ల గోల్డ్ స్కాం:  రూబీ జ్యూయల్లరీస్ సంస్థల్లో సోదాలు

సారాంశం

వేల కోట్ల రూపాయాలకు ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టిన చెన్నై రూబీ జ్యూయల్లరీ కుంభకోణం కేసులో  బుధవాంర నాడు అమీన్‌పూర్ లో షెల్టర్ తీసుకొన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు.

చెన్నై: వేల కోట్ల రూపాయాలకు ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టిన చెన్నై రూబీ జ్యూయల్లరీ కుంభకోణం కేసులో  బుధవాంర నాడు అమీన్‌పూర్ లో షెల్టర్ తీసుకొన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు.

2019 నుండి ఈ కేసులో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైద్రాబాద్ అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భెల్ మెట్రో కాలనీలో సయ్యద్ ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు మరో ముగ్గురు మహిళలను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు.

వడ్డీలేని రుణాలు ఇస్తామని ఇబ్రహీం నమ్మబలికాడు. బంగారం విలువలో మూడింట ఒక వంతు రుణాలు ఇస్తానని నమ్మించాడు. డబ్బులను తిరిగి ఇచ్చిన తర్వాత బంగారం బాధితులకు బంగారం ఇవ్వలేదు.

దీంతో  బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత 3 ఏళ్లలో 3 వేల మందికిపైగా రూ. 300 కోట్లకు పైగా విలువైన వెయ్యి కిలోల బంగారాన్ని నిందితులు సేకరించారు.
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu