రైతుల ఆందోళన: రాకేశ్ టికాయత్‌కు తప్పిన పెను ప్రమాదం

By Siva KodatiFirst Published Feb 3, 2021, 4:31 PM IST
Highlights

రైతులకు మద్దతుగా బుధవారం హర్యానాలోని జింద్‌లో “మహాపంచాయత్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీకేయూ నేత రాకేష్ తికాయత్‌తో పాటు పలు సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం తర్వాత ఉద్యమం నీరుగారిపోతుందని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా బుధవారం హర్యానాలోని జింద్‌లో “మహాపంచాయత్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీకేయూ నేత రాకేష్ తికాయత్‌తో పాటు పలు సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.

ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్‌ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజీ కూలిపోవడంతో దానిపైనున్న వారంతా కిందపడిపోయారు. దీంతో రాకేష్ తికాయత్‌ సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మరోవైపు, చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. చట్టాలను రద్దు చేయకపోతే, తాము ఇళ్లకు వెళ్లేది లేదని, ఇదే తమ నినాదమని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమం ముగిసేది లేదని తేల్చి చెప్పారు. 

click me!