‘‘ముఖ్యమంత్రే నా గురువు’’.. యోగికి పూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న పోలీసు.. విమర్శలు

First Published Jul 28, 2018, 11:33 AM IST
Highlights

గురుపూర్ణిమను పురస్కరించుకుని ఏకంగా ముఖ్యమంత్రికే పూజలు చేసి.. ఆయన నుంచి ఆశీర్వాదం కూడా తీసుకోవడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ  సీనియర్ పోలీస్ అధికారి గురుపూర్ణిమ సందర్భంగా గురువును పూజించాలనుకున్నాడు.

ఇటీవలికాలంలో ఉత్తరాదిలో కొంతమంది పోలీసుల చర్యలు విమర్శల పాలవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఉన్నతాధికారి కూర్చొని మహిళా సాధువు నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో ఢిల్లీలో కలకలం సృష్టించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతనిని మరో ప్రాంతానికి బదిలీ చేసింది ప్రభుత్వం.

తాజాగా గురుపూర్ణిమను పురస్కరించుకుని ఏకంగా ముఖ్యమంత్రికే పూజలు చేసి.. ఆయన నుంచి ఆశీర్వాదం కూడా తీసుకోవడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ  సీనియర్ పోలీస్ అధికారి గురుపూర్ణిమ సందర్భంగా గురువును పూజించాలనుకున్నాడు. అది మంచిదే.. తన గురువుగా సాక్షాత్తూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తీసుకుని.. ఆయనను కలిసి గురుపూజ చేసి.. అనంతరం సీఎం నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు.

గురుపౌర్ణిమ సందర్భంగా సీఎం నుంచి ఆశీరర్వాదం తీసుకున్నా... ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు.. గోరఖ్‌పూర్ ఆలయానికి ప్రధాన అర్చకులు.. అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఒక ఫోటోలో ప్రవీణ్ మోకాళ్లపై కూర్చొని యోగి ఆదిత్యనాథ్‌కు నమస్కరిస్తుండగా.. మరో ఫోటోలో యోగికి బొట్టు పెడుతూ.. పూలమాల వేస్తున్నట్లుగా ఉంది. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

పూజ చేయడం బాగానే ఉంది కానీ.. యూనిఫాంలో ఉండి ఇలాంటి పని చేయకూడదని కొందరు నెటిజన్లు అభ్యంతరం తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం ఇందులో తప్పేమి లేదని ప్రవీణ్‌కు సపోర్ట్‌గా నిలిచారు.
 

click me!