
న్యూఢిల్లీ : గతేడాది దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహాలోనే గీతా కాలనీలోని ఫ్లైఓవర్ దగ్గర ఓ మహిళ మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు బుధవారంనాడు కనుగొన్నారు.యువతి మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు గుర్తించారు. దీనిమీద విచారణ చేపట్టారు.
తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో బుధవారం ముక్కలుగా చేసిన మహిళ శరీర భాగాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.ఉదయం 9.15 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది.
శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు..ఇందిరాగాంధీ చివరి క్షణాలను వివరించిన వైద్యుడు
ఫ్లైఓవర్ సమీపంలో పలుచోట్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాధితురాలి శరీర భాగాలు, తల వంటి కొన్ని భాగాలను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన శరీర భాగాలను వెలికితీసేందుకు పోలీసు బృందం ఫ్లైఓవర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తోంది.
గత సంవత్సరం, 27 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ను ఆమె సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలా గొంతు కోసి చంపి, ఆపై ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని 18 రోజుల పాటు అడవిలో పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను కొన్నింటిని ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆమెను గుర్తు పట్టకుండా ఉండడానికి ఆమె ముఖాన్ని కాల్చాడు.
చాలా రోజులుగా ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం.. తాము ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వాకర్ తండ్రి మిస్సింగ్ ఫిర్యాదును దాఖలు చేయడంతో.. ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆఫ్తాబ్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతని మీద హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అభియోగాలు మోపారు.