
కార్లు, జీపులు ఎప్పుడోకప్పుడు రిపేర్ కి రావడం సహజం. ఎక్కడికైనా వెళ్తుంటే సడెన్ గా వాహనం ఆగిపోయింది అనుకోండి. వెంటనే మనం దగ్గరలోని మెకానిక్ కి ఫోన్ చేస్తాం.. లేదంటే.. పక్కవారి సహాయం తీసుకొని.. బండిని తోసుకుంటూ మెకానిక్ దగ్గరకు తీసుకువెళతాం. అయితే.. ఓ పోలీసు అధికారి మాత్రం ఏకంగా.. తానే స్వయంగా.. తన వట్టి చేతులతో ఆగిపోయిన బండిని లాక్కుంటూ మెకానిక్ షాప్ కి తీసుకువెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆయన తీరును ఫ్యాన్స్ అయిపోయారు. మీరు రియల్ బాహుబలి సర్ అంటూ పొగిడేస్తున్నారు.
కర్ణాటకలోని కొప్పళ జిల్లా యలబుర్గి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు రెడ్డి శుక్రవారం ఓ కేసు విచారణ నిమిత్తం స్కార్పియో వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
తిరిగి బయల్దేరుతుండగా వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో 20 మీటర్ల దూరంలోని మెకానిక్ షెడ్ వద్దకు స్వయంగా వాహనాన్ని లాక్కొని వెళ్లారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీస్ బాహుబలి అంటూ సందేశాలు పోస్టు చేశారు. శారీరక దృఢత్వంతో ఇలాంటి సాహసాలు చేయవచ్చని పేర్కొన్నారు.