శుభవార్త... భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..!

By telugu news teamFirst Published Jun 26, 2021, 10:52 AM IST
Highlights

గత కొంతకాలంగా గణనీయంగా తగ్గుతున్న క్రియాశీల కేసులు.. తాజాగా 6లక్షల దిగువకు చేరడం సంతోషకరం. క్రీయాశీల రేటు 1.97శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 96.72 శాతానికి పెరిగింది. 

ఇంతకాలం దేశాన్ని పట్టిపీడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. తాజాగా 17, 45,809 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... 48,698 మందికి పాజిటివ్ గా తేలింది. గతంతో పోలిస్తే.. కరోనా కేసులు భారీగా తగ్గినట్లే.  కరోనా పాజిటివ్ కేసుల్లో 5.7శాతం తగ్గుదల కనిపించింది.

ఈ నెలలో రెండోసారి రోజువారీ కేసులు 50 వేల దిగువకు  చేరాయి. తాజాగా మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,83,143కి చేరగా... 3,94,493మంది ప్రాణాలు కోల్పోయారు.

గత కొంతకాలంగా గణనీయంగా తగ్గుతున్న క్రియాశీల కేసులు.. తాజాగా 6లక్షల దిగువకు చేరడం సంతోషకరం. క్రీయాశీల రేటు 1.97శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 96.72 శాతానికి పెరిగింది. నిన్న 64,818 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.91 కోట్లకు చేరాయి. ఇదిలా ఉండగా.. రెండో దఫా వైరస్  విజృంభణ తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి మొదలౌతోంది. ఇది మళ్లీ ప్రజలను కలవరపెడుతోంది.

ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 48 డెల్టాప్లస్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా..  కరోనా టీకా కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. నిన్న 61,19,169 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 31,50,45,926కి చేరింది. 

click me!