మూడో పెళ్లికి సిద్ధపడిన భర్త: పురుషాంగాన్ని కోసి చంపేసిన భార్య

Published : Jun 26, 2021, 10:27 AM IST
మూడో పెళ్లికి సిద్ధపడిన భర్త: పురుషాంగాన్ని కోసి చంపేసిన భార్య

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. మూడో పెళ్లికి సిద్ధపడిన భర్తను వంటగదిలోని కత్తితో అతని పురుషాంగం కోసి చంపేసింది.

ముజఫర్ నగర్: మూడో పెళ్లికి సిద్ధపడిన భర్తను ఓ బార్య హత్య చేసింది. పురుషాంగాన్ని కోసి భర్తను చంపేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో జరిగింది. షికార్ పూర్ గ్రామానికి చెందిన మతాధికారి మౌల్వీ షకీల్ అహ్మద్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 

మూడో వివాహం చేసుకోవడానికి 57 ఏళ్ల అహ్మద్ సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని మౌల్వీ తన రెండో భార్యకు చెప్పాడు. మూడో పెళ్లి వద్దని ఆమె ప్రార్థించింది. భార్య హాజ్రా కోరికను అతను వినపించుకోలేదు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 

ఆ తర్వాత నిద్రపోయిన భర్తను రాత్రి హజ్రా వంటగదిలోని కత్తి తెచ్చి పురుషాంగాన్ని కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి అహ్మద్ మరణించాడు. నిందితురాలు తన బంధువుల సహకారంతో భర్త శవానికి అంత్యక్రియలు జరపాడనికి ప్రయత్నించింది. 

అనుమానం వచ్చి ఇరుగుపొరుగువారు పోలసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి హజ్రాను ప్రశ్నించారు. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు హజ్రాపై కేసు నమోదు చేసి, అహ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..