పంచాయితీ ఓటర్ల జాబితాలో అవకతవకలు... ముఖ్యమంత్రిపై కేసు నమోదు

By Arun Kumar PFirst Published Feb 24, 2021, 9:55 AM IST
Highlights

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ తో పాటు మరో 14మంది అధికారులకు కేసు నమోదు చేశారు. 
 

పాట్నా: గ్రామ పంచాయితీ ఓటర్ల నమోదులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏకంగా ముఖ్యమంత్రిపైనే కేసు నమోదయ్యింది. ఓటర్ల జాబితాలో పేర్ల తారుమారు వెనుక హస్తముందంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కేసు నమోదయ్యింది.  

బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ చిక్కి సోహగ్‌పూర్‌ గ్రామ పంచాయతీకి చెందిన ఓటర్ల జాబితాలో మరో గ్రామానికి చెందినవారి పేర్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నితీష్ ఆదేశాలతోనే అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేశారని ఆరోపిస్తూ కొందరు ముజఫర్‌నగర్‌ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ తో పాటు మరో 14మంది అధికారులకు కేసు నమోదు చేశారు. 

ఇదిలావుంటే బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ యాదవ్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన ప్రసంగాన్ని అడ్డుకున్న తేజస్వీ యాదవ్ ను ఉద్దేశించి ‘ఆ టైంలో నువ్వు ఒళ్లో ఆడుకుంటున్న పిల్లాడివి’ అంటూ రిటార్ట్ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో యూనియన్ మినిస్టర్ గా ఉన్న నితీష్ కుమార్ యాదవ్ పై తేజస్వీ యాదవ్ కామెంట్స్  చేస్తే దానికి సమాధానంగా... ‘ఆ టైంలో నువ్వు చిన్నపిల్లాడివి, నేను కూడా నిన్ను ఎత్తుకున్నాను’ అంటూ మట్లాడారు. 

 బడ్జెట్ సెషన్ మూడవ రోజు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నితిష్ కుమార్  ప్రసంగించారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల తమ ప్రభుత్వం పాలనలో  సాధించిన విజయాలపై సీఎం ప్రసంగిస్తుండగా తేజస్వీ యాదవ్ అనేకసార్లు అడ్డుకున్నారు. దీంతో తాను మాట్లాడడం పూర్తయ్యాక మీకు ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడండి... కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడేది వినండి.... దీనివల్ల మీకే ప్రయోజనం ఉంటుంది.. అని నితిష్ కుమార్ చురక అంటించారు. 

 
 


 

click me!