ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం కేసులు 3,31,74,954కి చేరిక

Published : Sep 10, 2021, 10:37 AM IST
ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం కేసులు 3,31,74,954కి చేరిక

సారాంశం

ఇండియాలో గత 24 గంటల్లో 34,973 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా కేసులు 3,31,74,954 కేసులు నమోదయ్యాయి.ఇండియాలో ఇప్పటివరకు కరోనా నుండి 3,23,42,299 మంది కోలుకొన్నారు. గత 24 గంటల్లో కరోనాతో 260 మంది మరణించారు. తాజాగా మరణించినవారితో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,42,009కి చేరుకొంది.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 34,973 మందికి కరోనా సోకింది.నిన్న 17.87 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 34,973  మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే కొత్త కేసులు తక్కువగా నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,31,74,954 కేసులు నమోదయ్యాయి.  ఇండియాలో ఇప్పటివరకు కరోనా నుండి 3,23,42,299 మంది కోలుకొన్నారు. 

గత 24 గంటల్లో కరోనాతో 260 మంది మరణించారు. తాజాగా మరణించినవారితో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,42,009కి చేరుకొంది.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 37,681 మంది కోలుకొన్నారు.ఇప్పటివరకు 3.23 కోట్ల మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.49 శాతంగా నమోదైంది. ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 3,90,646కి చేరుకొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.18 శాతంగా నమోదైంది. గురువారం నాడు 67.58 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. ఇప్పటివరకు 72.37 కోట్ల వ్యాక్సిన్ అందించారు.

 


 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో