మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

Published : Sep 10, 2021, 10:30 AM ISTUpdated : Sep 10, 2021, 11:03 AM IST
మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

సారాంశం

ఆ తర్వాత చిన్నారిని ఏమీ తెలియనట్లు ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అయితే.. చిన్నారి ప్రవర్తన అనుమానం కలిగించడంతో.. విషయం ఆరా తీశారు.

కనీసం ఊహ కూడా ఎరుగని ఓ పసి పిల్లపై ఓ  కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మైసూరులో చోటుచేసుకోగా.. ఆ కామాంధుడికి న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.

హుణసూరు తాలూకాలోని జగదీష్‌ (45) దోషి. ఇతను 2019లో హుణసూరు తాలూకా బిళకెరె పోలీసుస్టేషన్‌ పరిధిలోని గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చిన్నారిని ఏమీ తెలియనట్లు ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అయితే.. చిన్నారి ప్రవర్తన అనుమానం కలిగించడంతో.. విషయం ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు  చేశారు. వారు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా.. దర్యాప్తులో   పోక్సో కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి శ్యామ్‌ కంరోస్‌.. 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Longest Tunnels: 3 గంటల ప్రయాణం జస్ట్ 15 నిమిషాల్లోనే.. దేశాన్ని షేక్ చేస్తున్న టాప్ 10 మెగా టన్నెల్స్
పల్లెటూరిలో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ కార్డియాక్ కాన్ఫరెన్స్