
జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సమావేశం కోసం ముందుగానే రికార్డు చేసిన ఓ సందేశంలో ప్రధాని మాట్లాడుతూ.. కొన్ని అంశాల్లో ప్రపంచ పాలన విఫలమైందని, బహుళపక్షవాదం సంక్షోభంలో ఉందని అన్నారు. బహుళపక్ష సంస్థలు ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యాయని తెలిపారు. ‘‘బహుళపక్షవాదం నేడు సంక్షోభంలో ఉందని మనమందరం అంగీకరించాలి. ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు వంటివి గత కొన్నేళ్ల అనుభవాలు ప్రపంచ పాలన విఫలమైందని స్పష్టం చేస్తున్నాయి’’ అని అన్నారు.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: నిపుణుల కమిటీని ఏర్పాటు.. కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీం కోర్టు
‘‘ఏళ్ల తరబడి పురోగతి సాధించిన మనం నేడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. ఆహార, ఇంధన భద్రత కోసం ప్రయత్నిస్తూనే అనేక వర్ధమాన దేశాలు తట్టుకోలేని అప్పులతో సతమతమవుతున్నాయి. సంపన్న దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఇవి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అందుకే భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ ప్రపంచ దక్షిణాదికి వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నించింది’’ అని ప్రధాని అన్నారు.
విభజన సమస్యలపై ‘‘కామన్ గ్రౌండ్’’ కనుగొనాలని ప్రధాని మోడీ ప్రపంచ నాయకులను కోరారు. ‘‘అంతర్జాతీయంగా తీవ్ర విభేదాలు నెలకొన్న సమయంలో మనం కలుస్తున్నాం. ఈ గదిలో లేనివారిపై మనకు బాధ్యత ఉంది’’ అని ప్రధాని అన్నారు. మనం కలిసి పరిష్కరించుకోలేని సమస్యలు మనకు చేతనైన వాటికి అడ్డంకిగా రానివ్వకూడదు. తమ నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వారి మాట వినకుండా ఏ గ్రూపు కూడా ప్రపంచ నాయకత్వాన్ని పొందజాలదని ప్రధాని మోడీ అన్నారు. ఏది మనల్ని విడదీస్తుందనే దానిపై కాకుండా మనల్ని ఏకం చేసే వాటిపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: నిపుణుల కమిటీని ఏర్పాటు.. కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీం కోర్టు
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో 40 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. జీ20 సభ్య దేశాలతో పాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిపై 16 కత్తిపోట్లు.. ప్రేమోన్మాది ఘాతుకం...
ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలకు, రష్యా-చైనా కూటమికి మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు మంత్రులు భేటీ సందర్భంగా కీలక అంతర్జాతీయ సవాళ్లపై చర్చించే అవకాశం ఉందని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. ఈ సమావేశం అనంతరం భారత్ సంయుక్త ప్రకటనకు సర్వశక్తులు ఒడ్డనుంది. ఉక్రెయిన్ పరిస్థితిపై ‘సమిష్టి పాశ్చాత్య దేశాలు’ మాస్కో పట్ల ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం వల్లే బెంగళూరులో జరిగిన జీ20 ఆర్థికమంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసిందని రష్యా ఆరోపించింది.