
న్యూఢిల్లీ: ఈసీ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రధానమంత్రి, విపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.ప్రధానమంత్రి, సీజేఐ , లోక్‌సభలో విపక్ష నేతతో కూడిన కమిటీ సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ నియామకం జరగాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకపోతే వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సీబీఐ చీఫ్ నియామకం తరహలోనే ఎన్నికల కమిషన్ ను నియమించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిందిదేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలిజియం తరహ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కీలకమైన తీర్పును ఇచ్చింది. ఎన్నికల కమిషన్ న్యాయబద్దంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.