కన్నకూతురిని గర్భవతిని చేసిన కసాయి తండ్రి..!

Published : Feb 27, 2021, 11:42 AM IST
కన్నకూతురిని గర్భవతిని చేసిన కసాయి తండ్రి..!

సారాంశం

కూతురనే కనికరం కూడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం కూడా దాల్చింది.


కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపై ఓ కామాంధుడు కన్నేశాడు. కూతురనే కనికరం కూడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం కూడా దాల్చింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరువ ణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలో ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కమార్తె 9వ తరగతి చదువుతోంది. ఈ నేఫథ్యంలో, ఎనిమిది నెలల క్రితం తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా, గురువారం పాఠశాలకు వెళ్లిన ఆమె కడుపు ఉబ్బెత్తుగా ఉండడం గమనించిన ఉపాధ్యాయులు ఆమెను కామక్కూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రా నికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా, బాలిక ఎనిమిది నెలల గర్భవతిగా నిర్ధారణ అయింది. 

ఈ విషయమై  బాలిక అవ్వ ఆరణి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు, బాలిక తండ్రిని అరెస్టు చేసి ఆరణి క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తి మహాలక్ష్మి ఎదుట హాజరుపరచి వేలూరు జైలుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం