బంగ్లాదేశ్ మహిళలను రప్పించి వ్యభిచారం..!

Published : Apr 20, 2021, 11:11 AM ISTUpdated : Apr 20, 2021, 01:45 PM IST
బంగ్లాదేశ్ మహిళలను రప్పించి వ్యభిచారం..!

సారాంశం

బెంగళూరులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. బంగ్లాదేశ్  యువతులను నమ్మించి.. వారిని వ్యభిచార కూపంలోకి తోసేసినట్లు తేలింది.  


బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా దేశానికి రప్పించి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బెంగాల్ లో ఈ దందా కొంతకాలంగా సాగుతుండగా.. పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకులు పశ్చిమ బెంగాల్ కి చెందిన వారు కాగా.. మహిళలు బంగ్లాదేశ్ కి చెందిన వారుగా గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...  పశ్చిమ బెంగాల్ కి చెందిన నౌషద్ అలీ, స్వరూప్, సమీర్ అనే ముగ్గురు వ్యక్తులు.. బెంగళూరులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. బంగ్లాదేశ్  యువతులను నమ్మించి.. వారిని వ్యభిచార కూపంలోకి తోసేసినట్లు తేలింది.

మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్‌లో వేశ్యవాటిక నడుస్తున్నట్లు తెలిసి దాడులు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నౌషద్‌అలీ, స్వరూప్, సమీర్‌ అనే ముగ్గురిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. 11 నకిలీ ఆధార్‌ కార్డులను సీజ్‌ చేశారు. ఇద్దరు బంగ్లాదేశ్‌ మహిళలను కాపాడారు. మహిళలకు బెంగళూరులో మంచి ఉపాధిని చూపిస్తామని ఇక్కడకు తీసుకొచ్చి బలవంతంగా వేశ్యావృత్తి చేయించేవారని తేలింది.    

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu