కరోనా ఎఫెక్ట్: ఐసీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు

Published : Apr 20, 2021, 10:56 AM ISTUpdated : Apr 20, 2021, 11:04 AM IST
కరోనా ఎఫెక్ట్: ఐసీఎస్ఈ టెన్త్ పరీక్షలు  రద్దు

సారాంశం

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐసీఎస్ఈ కూడ టెన్త్ పరీక్షలను రద్దు చేసింది

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐసీఎస్ఈ కూడ టెన్త్ పరీక్షలను రద్దు చేసిందిసీబీఎస్ఈ  కూడా ఇప్పటికే టెన్త్ పరీక్షలను రద్దు చేసింది.మరోవైపు షెడ్యూల్ ప్రకారంగానే ఐసీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టుగా బోర్డు ప్రకటించింది. గుజరాత్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు కూడ టెన్త్ ఫైనల్ పరీక్షలను వాయిదా వేశాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు స్కూల్స్ ను మూసివేశాయి.

also read:ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్: 24 గంటల్లో 1761 మంది మృతి

చాలా యూనివర్శిటీలు తమ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశాయి. మెడికల్ స్టూడెంట్స్ కు మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరీక్షలను వాయిదా వేసింది. ఉత్తరప్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యూనివర్శిటీ కూడ మే 15 వరకు పరీక్షలను వాయిదా వేసింది.

రాజస్తాన్ రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కేరళ లో పీజీ, అండర్ పీజీలో విద్యార్ధుల పరీక్షలను తర్వాత నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఐఐటీ జేఈఈ ఇంజనీరింగ్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధును ప్రమోట్ చేసింది.  ఏపీ ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారంగానే టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. 


 

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు