కరోనా కేసులు ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 15,19,486 మందికి పరీక్షలు నిర్వహిస్తే 2.59 లక్షల మందికి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: కరోనా కేసులు ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 15,19,486 మందికి పరీక్షలు నిర్వహిస్తే 2.59 లక్షల మందికి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో ఇప్పటికే 1,53,21,089 మందికి కరోనా సోకింది. సోమవారం నాడు దేశంలో 2.73 లక్షల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 1761 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,80,530కి చేరుకొంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది.
undefined
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,31,977కి చేరుకొంది. ఇప్పటివరకు 1,31,08,582 మంది కరోనా నుండి కోలుకొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 58,924 కేసులు నమోదయ్యాయి.దేశంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మే 1 నుండి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.