భోపాల్‌లో నాలుగు హత్యల పాల్పడిన సీరియల్ కిల్లర్.. అప్రమత్తమైన పోలీసులు.. రూ. 30 వేల రివార్డు ప్రకటన

Published : Sep 02, 2022, 11:52 AM IST
భోపాల్‌లో నాలుగు హత్యల పాల్పడిన సీరియల్ కిల్లర్.. అప్రమత్తమైన పోలీసులు.. రూ. 30 వేల రివార్డు ప్రకటన

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వ‌రుస హ‌త్య‌ల ఘ‌ట‌న‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ హత్యల వెనక సీరియర్ కిల్లర్ ఉన్నారని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఇప్పటివరకు ముగ్గురు దారుణంగా హత్య చేయబడగా.. సీరియల్ కిల్లర్ దాడిలో తీవ్రంగా గాయపడిన నాలుగో బాధితుడు తాజాగా మరణించాడు.

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వ‌రుస హ‌త్య‌ల ఘ‌ట‌న‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ హత్యల వెనక సీరియర్ కిల్లర్ ఉన్నారని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఇప్పటివరకు ముగ్గురు దారుణంగా హత్య చేయబడగా.. సీరియల్ కిల్లర్ దాడిలో తీవ్రంగా గాయపడిన నాలుగో బాధితుడు మంగళ్ అహిర్వార్ భోపాల్‌లో హమీద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. ఈ క్రమంలోనే పోలీసులు హంతకుడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేలా సమాచారం ఇచ్చిన వారికి రూ. 30,000 రివార్డు ఇవ్వనున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో నిద్రిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాగర్‌ ఎస్పీ తరుణ్‌నాయక్‌ కోరారు. 

ఇక, జిల్లాలో పోలీసు పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. సాయుధ బలగాల సిబ్బందిని కూడా మఫ్టీలో మోహరించారు. నాలుగు హత్యలకు గొడవలు, దొంగతనాలు కారణమని ఎస్పీ తేల్చిచెప్పారు. కిల్లర్ సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకుని, నిద్రలో ఉన్న సమయంలో వారిపై దాడి చేస్తున్నాడని చెప్పారు.

సీరియర్ కిల్లర్ దాడిలో గాయపడిన మంగళ్ అహిర్వార్.. చనిపోవడానికి ముందు చికిత్స పొందుతున్న సమయంలో అనుమానితుడి స్కెచ్‌ను విడుదల చేయడంలో పోలీసులకు సహాయం చేశాడు. దీంతో పోలీసులు ఆ స్కెచ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహిర్వార్ ప్రాణాలతో బయటపడతాడని పోలీసులు భావించారు. అయితే తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడి పరిస్థితి విషమించి.. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. 

తొలుత ఈ ఏడాది మే నెలలో మక్రోనియా బండ రోడ్డులోని ఓవర్‌బ్రిడ్జి నిర్మాణ స్థలంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఉత్తమ్ రజక్ హత్యకు గురయ్యాడు. దుండగుడు రజక్ దెబ్బతిన్న ముఖంపై షూ ఉంచాడు. ఇక, లోధీ, దూబే, అహిర్వార్‌లు ఆది, సోమ, మంగళవారాల్లో తిరిగి రాత్రుల్లో హత్యకు గురయ్యారు.

కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 28-29 మధ్య రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కళ్యాణ్ లోధి(50) అనే వ్యక్తి హ‌త్య‌కు గుర‌య్యారు. అత‌డిని హ‌త్య చేయ‌డానికి  హంతుకుడు..సుత్తిని వాడిన‌ట్టు పోలీసులు గుర్తించారు. వాట్ మెన్ తలను సుత్తితో పగులగొట్టి అతి కిరాతకంగా చంపేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

ఇంకో హత్య సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 29-30 మధ్య రాత్రి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో జ‌రిగింది. ఇక్క‌డ  విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు శంభు నారాయణ్ దూబే (60) హత్యకు గురయ్యాడు. అతని తలను రాయితో పగులగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఆగస్టు 30-31 మధ్య రాత్రి సాగర్‌లోని మోతీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్ మంగళ్ అహిర్వార్‌ను దుండగుడు కర్రతో దాడి చేసినట్టగా పోలీసులు చెప్పారు అయితే అహిర్వార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

PREV
click me!

Recommended Stories

Jio Recharge Plans : కేవలం రూ.11 కే 10GB,రూ.49 కే 25GB హైస్పీడ్ డేటా
Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu