యువతిని ప్రేమించి, పెళ్లి పేరుతో నమ్మించి, శారీరకంగా వాడుకుని... కానిస్టేబుల్ మోసం..ఎక్కడంటే...

Published : Sep 02, 2022, 11:15 AM IST
యువతిని ప్రేమించి, పెళ్లి పేరుతో నమ్మించి, శారీరకంగా వాడుకుని... కానిస్టేబుల్ మోసం..ఎక్కడంటే...

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఓ కానిస్టేబుల్ యువతిని ప్రేమపేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించింది. 

ఉత్తరప్రదేశ్ : అతను  ఓ పోలీస్..  ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు.  ఐ లవ్ యూ అంటూ ఆమెను దగ్గరయ్యాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్ళి విషయం ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిరోజాబాద్ కు చెందిన యువతి (24)తో కానిస్టేబుల్ అమిత్ యాదవ్ కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుంటానని అమిత్ తెలిపాడు. 

దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. ఆ తరువాత కాబోయే భర్తే కదా అని.. అతని మాయ మాటలు నమ్మి, ఆమె అతడికి శారీరకంగా దగ్గరయ్యింది. అయితే, ఆ తరువాత పెళ్ళి విషయం ఎత్తగానే.. ఏదో సాకు చెబుతూ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో, బాధితురాలు.. అమిత్ యాదవ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిని అడిగింది. అలా 2021లో వీరిద్దరికీ పెళ్లి చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ, కట్నం విషయంలో తేడాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి వాయిదా పడింది.

యువతిని, ఆమె తల్లిని హత్య చేసిన దుండగుడు.. ఇంట్లోకి దూరి మరి దారుణం.. అదే కారణమా..?

ఈ క్రమంలో మరోసారి పెళ్లి విషయమై అమిత్ ను నిలదీయగా.. అదనపు కట్నం కావాలని కోరినట్లు తెలిసింది.  ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్, అతని తల్లి కూడా కట్నం డిమాండ్ చేశారు. అతని కుటుంబం రూ.14 లక్షల కట్నం డిమాండ్ చేసింది. దీనికి ఒప్పుకున్నాం. దాంతో అమిత్ తో నా వివాహం ఆగస్ట్ 2021కి నిర్ణయించారు. కానీ కట్నం కోసం అమిత్ పెళ్లిని వాయిదా వేయడమే కాకుండా, కట్నంగా రూ.19లక్షలు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  దీంతో ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలపడంతో.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని ఫిరోజాబాద్  రూరల్ ఎస్పీ రణ్ విజయ్ సింగ్ తెలిపారు.

ఇదిలా ఉండగా, నిరుడు జూలైలో ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జరిగింది.  తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్టేషన్ ఎస్సై బాలకృష్ణ యాదవ్  తనను ప్రెమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ బాధిత యువతి ఆరోపిస్తోంది.న్యాయం చేయాలంటూ.. కొద్ది రోజులుగా  స్టేషన్ వద్ద పడిగాపులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యువతి వాపోయింది. 

దీంతో చేసేది లేక స్టేషన్ ముందు బైటాయించి, ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పుకొచ్చింది. యువతి ప్రయత్నాన్ని గమనించి పోలీసులు అడ్డుకున్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని  చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ శేషగిరిరావు హామీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం