కర్నాటకలో తలలేని మొండెం మిస్టరీ.. క్లూ చెబితే లక్ష నజరానా....

By SumaBala BukkaFirst Published Jun 25, 2022, 7:54 AM IST
Highlights

కర్నాటకలో గత పదిహేను రోజుల క్రితం ఇద్దరు మహిళల మృతి కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. రెండు మృతదేహాలకు తలలు లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉండడంతో కేసు మిస్టరీగా మారింది. 

కర్నాటక : కర్నాటకలోని మండ్య జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల మృతదేహాల మిస్టరీ వీడలేదు. ఘటన జరిగి 15 రోజులవుతున్నా.. మిస్టరీ వీడకపోవడంతో పోలీసులు చిన్న క్లూ అయినా దొరకకపోతుందా అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. వారికి హతులెవరో? హంతకులెవరో? అనేది చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఈ మరణాలమీద సమాచారం ఇస్తే బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

ఈ నెల 7వ తేదీన మండ్య జిల్లాలోని పాండవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బేబి గ్రామంలో ఉన్న చెరువులో సుమారు 30 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. అయితే, ఈ మృతదేహానికి తల లేదు. మొండెం మాత్రమే ఉంది. ఇప్పటివరకు హతురాలు ఎవరో నిర్థారణ కాలేదు. వివరాలను తెలిపిన వారికి రూ. లక్ష బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. 

అదే రోజు శ్రీరంగ పట్టణం తాలూకా అరికెరె పోలీస్ స్టేషన్ పరిధిలో సీడీఎస్ కాలువ వద్ద నీటి గుంతలో 40 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. ఆమెకు కూడా తల లేదు. ఇద్దరి ఒంటిపై బట్టలు లేవు. ఈ మహిళ వివరాలు చెప్పిన వారికి రూ. లక్ష నజరానాను ప్రకటించారు. 

కర్నాటకలోని మాండ్యా పోలీసులు ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపినవారికి లక్ష రూపాయల రివార్డును బుధవారం ప్రకటించారు. జూన్ 7న కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని పాండవపుర, శ్రీరంగపట్నం ప్రాంతాల్లో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి.

Young woman Cuts Tongue: నాలుక కోసి కాళీ మాత‌కు నైవేద్యంగా పెట్టిన యువతి

ఒక మృతదేహాన్ని సంచిలో కుక్కగా, మరొకటి నీటి కుంటలో లభ్యమైంది. దీంతో మండ్య పోలీసులు దీన్ని సుమోటో కేసుగా  నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలు ఛిద్రమైన తీరును బట్టి చూస్తే ఈ రెండు కేసులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు వికృతంగా ఉండడంతో పాటు, తలలు లేకపోవడంతో కేసును చేధించడం కష్టంగా మారింది. ఈ కేసును విచారించేందుకు మండ్య పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా, తీహార్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. 19యేళ్ల అండర్ ట్రయల్ ఖైదీలు సీలింగ్ ఫ్యాన్ కు విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు అధికారులు తెలిపారు.  ఉత్తర ప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన బ్రహ్మ్ నంద్ అలియాస్ వికాస్ కిడ్నాప్, రేప్ కేసుల్లో పోక్సో యాక్ట్ ప్రకారం ఫిబ్రవరి 4 నుంచి జైలులో ఉన్నట్లు సీనియర్ జైలు అధికారులు వెల్లడించారు. 

వికాస్  జైలులోని మొదటి అంతస్తులో అండర్ ట్రయల్ ఖైదీలు రికార్డు రూమ్లో సేవదార్ గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగా రికార్డు రూంకు వచ్చిన వికాస్..మళ్లీ కనిపించలేదు. మధ్యాహ్నం 2.50గంటలకు తన గది తలుపులు మూసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఖైదీలు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే వికాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.  వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా ..వికాస్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 
 

click me!