మెహుల్ చోక్సీ అంటిగ్వాలో అదృశ్యం: గాలిస్తున్న పోలీసులు

By telugu teamFirst Published May 25, 2021, 7:00 AM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చోక్సీ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది ధ్రువీకరించారు. అంటిగ్వాలో చోక్సీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యమయ్యాడు. అంటిగ్వా దీవిలో తల దాచుకుంటున్న ఆయన కనిపించుకుండా పోయినట్లు ఆయన తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు.

చోక్సీ అదృశ్యంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రముఖ రెస్టారెంట్ లో విందు కోసం చోక్సీ నిన్న సాయం్తరం వెళ్లినట్లు తెలుస్ోతంది. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్ లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు చెప్పారు. అంటిగ్వా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. 

మెహుల్ చోక్సీ 2017లో అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్బీ కుంభకోణం బయటపడింది. దాంతో నీరవ్ మోడీతో పాటు మెహుల్ చోక్సీ దేశం పారిపోయాడు. నీరవ్ మోడీకి మెహుల్ చోక్సీ మేనమామ అవుతాడు.

61 ఏళ్ల వయస్సు గల మెహుల్ చోక్సీ గీతాంజలీ గ్రూప్ యజమాని. పిఎన్బీ కుంభకోణం కేసులో సిబిఐకి, ఈడీకీ ఆయన వాంటెడ్ గా ఉన్నారు. 

click me!