
Aaditya Thackeray: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మహారాష్ట్ర పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన భద్రతా సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్( SPG) మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య థాకరేకి గట్టి షాక్ ఇచ్చారు. మోదీకి స్వాగతం పలికేవారి జాబితాలో ఆదిత్య థాకరే పేరు లేదంటూ ఆయనను అడ్డుకుంది. అలాగే.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కారులో నుంచి దిగిపోవాలని SPG ఆదేశించింది. ఈ చర్యతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర అసహనానికి గురయ్యారు. తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తూ.. భద్రతా సిబ్బందితో మాట్లాడి.. వారిని ఒప్పించినట్టు.. చిట్టచివరి నిమిషాల్లో అనుమతించినట్లు పలు జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మహారాష్ట్రలోని ముంబాయిలో పర్యటించారు. ఆయనకు సీఎం ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య థాకరే ఒకే కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే.. మంత్రి ఆదిత్య థాకరేను గమనించి పీఎం భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికే వీఐపీల జాబితాలో ఆదిత్య థాకరే పేరు లేదని, అందువల్ల ఆయనను సీఎం ఉద్దవ్ థాకరే కారు నుంచి దిగిపోవాలని SPG ఆదేశించారు.
ఈ చర్యతో ఉద్ధవ్ థాకరే తీవ్ర అసంతృప్తి చెందారట. తన కుమారుడు గురించి ప్రధాని సిబ్బందితో మాట్లాడుతూ.. అతడు తన కొడుకు మాత్రమే కాదనీ, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి అని.. అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోదీకి స్వాగతం పలికే అధికారం తనకు ఉందని శివసేన చీఫ్ భద్రతా సిబ్బందితో వారించారట. ఇక చివరికి ఆదిత్య ఠాక్రే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మహారాష్ట్ర పర్యటనలో భాగంగా గవర్నర్ హౌస్‌లో జల్‌భూషణ్ భవన్, విప్లవకారుల గ్యాలరీని ప్రారంభించారు. దీని తర్వాత, ముంబైకి చెందిన ప్రతిష్టాత్మక వార్తాపత్రికలలో ఒకటైన ముంబై సమాచార్ 200వ వార్షికోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేశారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబై సమాచార్ పత్రిక 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాంతీయ వార్తాపత్రికలు ముఖ్యమైన పాత్ర పోషించాయనీ, దేశాభివృద్ధిలో పార్సీ సమాజం పెద్ద పాత్ర పోషించిందని తెలిపారు. ఛత్రపతి శివాజీ, శంభాజీల గురించి ప్రస్తావించారు. 'స్వరాజ్' గురించి మాట్లాడేటప్పుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితాలు ఇప్పటికీ ప్రతి భారతీయుడిలో దేశభక్తి భావనను రేకిస్తాయని అన్నారు.