మోడీ, ఉద్ధవ్‌లు వేదిక పంచుకున్న వేళ.. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని

Published : Jun 14, 2022, 08:15 PM IST
మోడీ, ఉద్ధవ్‌లు వేదిక పంచుకున్న వేళ.. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని

సారాంశం

ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చాన్నాళ్ల తర్వాత వేదిక పంచుకున్నారు. ఈ రోజు ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్‌భవన్‌లో జల్ భూషణ్ బిల్డింగ్, రివల్యూషనరీల గ్యాలరీని ప్రారంభించారు.   

ముంబయి: మహారాష్ట్రలో శివసేన.. బీజేపీతో స్నేహాన్ని వదిలి ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీకి, శివసేనకు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉన్నది. రాష్ట్రం వర్సెస్ కేంద్రంగానూ ఈ యుద్ధం జరిగింది.  ఈ తరుణంలో మంగళవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కలిసి వేదిక పంచుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్ర పర్యటించారు. కొలాబలోని నవాల్ హెలిపోర్ట్‌కు వెళ్లి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ప్రోటోకాల్ మినిస్టర్ ఆదిత్యా ఠాక్రేలు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు.

అనంతరం వారు.. రాజ్‌భవన్ పయనం అయ్యారు. అక్కడ జల్ భూషణ్ బిల్డింగ్, రివల్యూషనరీల గ్యాలరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వేదికపై ప్రధాని మోడీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేలు పక్క పక్కనే కూర్చున్నారు. రివల్యూషనరీల గ్యాలరీని ప్రధాని మోడీ ప్రారంభించడం గొప్ప విషయం అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే వివరించారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టోరీలను సజీవంగా ఉంచే బాధ్యత మనందరిది అని తెలిపారు. తర్వాతి తరానికి అప్పగి గొప్ప పోరాటాలను వివరించడానికి ఇవే కీలకంగా ఉపకరిస్తాయని, వారూ సులువగా అర్థం చేసుకుని దేశ స్వాతంత్ర్య ఉద్యమకారులపై గౌరవంగా ఉంటారని చెప్పారు.

అనంతరం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ముంబయి సమాచార్ ద్విశతాబ్ది మహోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అక్కడ ప్రధాని మోడీ మాట్లాడారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !