ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ సంబురాల్లో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్.. కేరళలో ‘వజ్ర జయంతి యాత్ర’

By Mahesh KFirst Published Jun 14, 2022, 7:37 PM IST
Highlights

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ పాల్గొంటున్నది. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎన్ సీసీతో కలిసి దేశవ్యాప్తంగా వజ్ర జయంతి యాత్రలను చేపడుతున్నది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య ఉద్యమ స్మారకాలు, మిలిటరీ స్థావరాలు, వ్యవసాయ, సాంస్కృతిక, శాస్త్రీయ పరిశోధన కేంద్రాల గుండా ఈ యాత్ర చేపట్టనుంది. ఇలాంటి కార్యక్రమాలు రేపటి దేశ సైనికులను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఏషియానెట్ న్యూస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేశ్ కల్రా అన్నారు.

హైదరాబాద్: దేశం స్వాతంత్ర్య పొంది 75 ఏళ్లు నిండుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ప్రముఖ ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ కూడా పాల్గొంటున్నది. ఏషియానెట్ న్యూస్, ఎన్‌సీసీ సంయుక్తంగా వజ్ర జయంతి యాత్రను చేపడుతున్నాయి. కేరళలో ఈ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. కేరళ యాత్రలో 20 మంది ఎన్‌‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ యాత్ర స్వాతంత్ర్య ఉద్యమ స్మారకాలు, మిలిటరీ స్థావరాలు, వ్యవసాయ, సాంస్కృతిక, శాస్త్రీయ పరిశోధన కేంద్రాల గుండా ఈ యాత్ర సాగనుంది. ఇదే రోజు రక్త దాన దినోత్సవం కావడంతో 75 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఐదు రక్తదాన కేంద్రాల్లో బ్లడ్ డొనేట్ చేశారు. ఈ మిషన్‌లో మొత్తం 375 మంది క్యాడెట్లు పాల్గొంటారు. 

భారత మీడియా రంగంలో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌కు ప్రతిభావంతమైన 25 ఏళ్ల అనుభవం ఉన్నది. అమృత్ మహోత్సవ్ సంబురాలను ప్రపంచవ్యాపితంగా వివిధ వేదికల ద్వారా ఈ సంస్థ ప్రచురిస్తున్నది. 

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 150 ఎన్‌సీసీ క్యాడెట్లతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సంయుకత్ంగా ఈ యాత్రలు చేపట్టనుంది. ఈ యాత్రలో 150 ఎన్‌‌సీసీ క్యాడెట్లతోపాటు ఎన్‌సీసీ ఆఫీసర్లు, మెంటర్లు కూడా యాత్రంలో వెంట ఉంటారు. వీరిలో 75 మంది క్యాడెట్లు దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు అవుతారు.

దేశంలోని కీలక ప్రాంతాల గుండా సాగే యాత్ర దేశ సంపద, దాని సామర్థ్యం గురించి పార్టిసిపెంట్లలో ఒక అవగాహన కలుగ చేస్తుంది. వీరంతా ఇతరులతో తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరి ఒక గొప్ప ఎనర్జీ పాస్ అవుతుంది. ఇవన్నీ రేపటి దేశ సైనికులను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఏషియానెట్ న్యూస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేశ్ కల్రా అన్నారు. గడిచిన 75 ఏళ్ల స్వతంత్ర దేశం సాధించిన విజయాలు శతవసంతాల స్వతంత్ర భారతం ఎలా ఉండాలనే ఆలోచనలనూ రేకెత్తిస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏషియానెట్ న్యూస్ బిజినెస్ హెడ్ ఫ్రాంక్ పీ థామస్, గ్రూప్ మేనేజింగ్ ఎడిటర్ మనోజ్ కే దాస్, ఎడిటోరియల్ అడ్వైజర్ ఎంజీ రాధాక్రిష్ణన్‌లూ పాల్గొన్నారు.

click me!