ప్రధాని ప్రతీది పర్సనల్ గా తీసుకుంటారు - భారత్-మాల్దీవుల వివాదంపై మల్లికార్జున్ ఖర్గే

By Sairam IndurFirst Published Jan 9, 2024, 6:16 PM IST
Highlights

India -  Maldives row : ప్రధాని నరేంద్ర మోడీ ( Prime minister narendra modi)ప్రతీ విషయాన్ని పర్సనల్ గా తీసుకుంటున్నారని కాంగ్రెస్ (congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (mallikharjun kharge)అన్నారు. మన ఇరుగు పొరుగు దేశాలతో స్నేహపూర్వకంగా ఉండాలని ఆయన సూచించారు.

India -  Maldives row : మాల్దీవులు - భారత్ కు మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పందించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి విషయాన్ని పర్సనల్ గా తీసుకుంటున్నారని అన్నారు. మన దేశానికి సరిహద్దులో ఉన్న వారిని మనం మార్చలేమని అన్నారు. 

జపాన్ లో మళ్లీ భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రత నమోదు..

Latest Videos

వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. మన పొరుగువారిని మనం ఎప్పటికీ మార్చలేమని చెప్పారు.

కాగా.. ఈ విషయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మాత్రం ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచారు. ప్రధాని పదవిని గౌరవించాలని, అలాంటి వ్యాఖ్యలను అంగీకరించబోమని ఆయన అన్నారు. ఆయన మన దేశానికి ప్రధాని అని అన్నారు. ఎవరైనా, ఎలాంటి పదవిలో ఉన్న వారైనా మన దేశ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తాము అంగీకరించబోమని తెలిపారు. ప్రధాని పదవిని గౌరవించాలని చెప్పారు. దేశం బయటి నుంచి ప్రధానికి వ్యతిరేకంగా దేనినీ అంగీకరించమని శరద్ పవార్ స్పష్టం చేశారు.

సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇక లేరు..

ఇటీవల ప్రధాని లక్షద్వీప్ లో పర్యటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ ఫొటోలపై మాల్దీవులకు చెందిన ముగ్గురు నేతలు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్సూమ్ మాజిద్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని, భారతీయులను అపహాస్యం చేస్తూ కామెంట్లు చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై సోషల్ మీడియాతో తీవ్ర చర్చ జరిగింది. 

భక్తిని చూపించండి.. అనవసర ప్రకటనలు చేయొద్దు - బీజేపీ నేతలకు ప్రధాని సూచన

దీంతో మల్దీవుల్లో ప్లాన్ చేసుకున్న టూర్ షెడ్యూల్ లను పలువురు క్యాన్సిల్ చేసుకున్నారు. మల్దీవులకు బదులు లక్షద్వీప్ ను సందర్శించాలని సినీ తారలు, క్రికెటర్లు పిలుపునిచ్చారు. కాగా.. మాల్దీవుల మంత్రుల చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశంపై బలంగా లేవనెత్తగా, మాల్దీవుల అగ్రనేతలు అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ కూడా ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. కాగా.. గత వారం మాల్దీవుల ప్రభుత్వం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన ముగ్గురు డిప్యూటీ మంత్రులను సస్పెండ్ చేసింది.

click me!